తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా తెలుగుదేశాన్ని మరువడం సాధ్యం కాదు, పరాయి గడ్డయినా పుట్టిన ఊరయినా ‘అన్న’ ను మరియ అన్న స్ధాపించిన తెలుగుదేశాన్ని అభిమానించె ప్రజానీకం ఇంకా అశేషం.
భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీకు వీరాభిమానులు ఉన్నారు, గల్ఫ్ కూటమిలోని పెద్ద దేశమైన సౌదీ అరేబియాలో తెలుగుదేశం పార్టీ చురుక్కుగా ఉంది. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు నివసిస్తున్న జుబేల్ పారిశ్రామిక నగరంలో బుధవారం తెలుగుదేశం పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది.
ఒక వైపు రంజాన్ మరో వైపు మాములు పని దినమైనప్పటికి తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్న వీరాభిమానంతో తెలుగుదేశం అవిర్భావ దినోత్సవాన్ని ప్రవాసీయులు అంగరంగ వైభవంగా జరుపుకోన్నారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా విడియో కాల్ ద్వార కార్యక్రమానికి నేతృత్వం వహించగా, మాదాల భరద్వాజ, మద్దుకూరి చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవానికి తీసుకోవచ్చిన ప్రతిష్ఠ గూర్చి వివరించారు. తెలుగుదేశం పార్టీ జుబైల్ నాయకులు కొగంటి శ్రీనివాస రావు, బలుసు నాగేశ్వరరావు, భూపతి రెడ్డి, రాంబాబు చౌదరి, యన్. వి. రావు,పూషన్ చౌదరి, పనిగరి రంజీత్, నార్నే చంద్రశేఖర్, వీరబాబులు వివిధ కార్యక్రమాలను చేపట్టగా తెలుగు ప్రముఖులు రాకేశ్, డాక్టర్ శ్రీనివాస రావు, రామరాజు, బాలాజీ, పట్టాభి రామయ్య, ఉండవల్లి శ్రీ కృష్ణ తదితరులు పాల్గోన్నారు.