అమెరికాలో వున్న హెచ్ 1 బీ వీసాదారులకు,( H-1B visa ) వారి జీవిత భాగస్వాములకు కోర్ట్ శుభవార్త చెప్పింది.హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవచ్చని తీర్పు వెలువరించింది.హెచ్ 1 బీ వీసా హోల్డర్స్‌లోని కొన్ని కేటగిరీలకు చెందిన జీవిత భాగస్వాములకు ఎప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డులను( Employment Authorization Card ) జారీ చేసేలా బరాక్ ఒబామా పాలనాకాలంలో నిబంధనలు వచ్చాయి.హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా ( America ) ఇప్పటి వరకు 1,00,000 వర్క్ ఆథరైజేషన్‌లను జారీ చేసింది.
ఇందులో భారతీయులే అత్యధికం.అయితే వీటిని రద్దు చేయాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను యూఎస్ జిల్లా జడ్జి తాన్యా చుట్కాన్ కొట్టివేశారు.
సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనేది ఐటీ ఉద్యోగులతో కూడిన సంస్థ.వీరు హెచ్ 1 బీ వర్కర్స్ వల్ల తమ ఉద్యోగాలను కోల్పోయామని కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.
అయితే అమెజాన్, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు సేవ్ జాబ్స్ యూఎస్ఏ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని వ్యతిరేకించాయి.హెచ్ 4 వీసా పొందిన విదేశీయులు అమెరికాలో వున్న సమయంలో పనిచేసుకోవడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీకి కాంగ్రెస్ ఎప్పుడూ అధికారాన్ని మంజూరు చేయలేదని సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి తాన్యా చుట్కాన్ అన్నారు.
అయితే హెచ్ 4 వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో వుంటూ ఉద్యోగం చేసుకునేలా అనుమతి ఇచ్చేందుకు దేశ చట్టసభలు మొగ్గు చూపుతున్నాయని చుట్కాన్ గుర్తుచేశారు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ కేవలం విద్యార్ధులకే కాకుండా వారి జీవిత భాగస్వాములు వారిపై ఆధారపడిన వారికి కూడా గతంలో ఉపాధిని కల్పించిందని న్యాయమూర్తి గుర్తుచేశారు.ఇదిలావుండగా.2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన విడుదల చేసింది.అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు నిర్ణీత పరిమితికి (క్యాప్) చేరుకున్నాయని తెలిపింది.ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసినట్లు వెల్లడించింది.
సోమవారం విడుదల చేసిన ప్రకటనను అనుసరించి హెచ్1 బీ క్యాప్‌కు తగినన్ని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లను పొందినట్లు తెలిపింది.
ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.యూఎస్ కాంగ్రెస్ హెచ్ 1 బీ కేటగిరీకి ప్రస్తుతం వార్షిక రెగ్యులర్ క్యాప్‌ను 65000గా నిర్ణయించింది.ఇందులో 6800 వీసాలు యూఎస్ – చిలీ, యూఎస్- సింగపూర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అమలు చేసే చట్టపరమైన నిబంధనల ప్రకారం పక్కనపెట్టారు.
ఒకవేళ ఇందులో ఏవైనా వీసాలు మిగిలిపోతే వాటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం రెగ్యులర్ హెచ్ 1 బీ క్యాప్ కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.