Agriculture

పసుపు బోర్డుకు పంగనామంపై రైతులు కన్నెర్ర

పసుపు బోర్డుకు పంగనామంపై రైతులు కన్నెర్ర

నిజామాబాద్ వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు

పసుపు బోర్డు… ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని వినూత్న తీరిలో నిరసన
జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఇదే మా ఎంపీ తెచ్చిన పసుపు బోర్డు అని ఫ్లెక్సీల ఏర్పాటు

పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దానం చేసి బాండ్ పేపర్ రాసిచ్చిన ఎంపీ అరవింద్
నిజామాబాద్ కి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ , రామ్ మాధవ్

పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో ప్రకటించిన విషయం విధితమే. ఈ ప్రకటనతో రైతుల ఆగ్రహం కట్టలుతెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిరసనగా స్థానిక బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా “పసుపు బోర్డు… ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు”