*రంగారెడ్డి:……..
నార్సింగీ లో విషాదం. పుప్పాల్ గూడ లో వినోద్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.
ఉద్యోగం పోతుందనే తీవ్ర మనస్తాపం. గది లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య.
తీవ్ర విషాదం లో కుటుంబ సభ్యులు. వినోద్ స్వస్థలం గుంటూరు జిల్లా. గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం.
సంస్థ ఒత్తిడి……పలు సాఫ్ట్‌వేర్ సంస్థల ల్లో ఉద్యోగాలు కొల్పొతున్న ఇంజనీర్లు. తన ఉద్యోగం కూడా పోతుందని ఆందోళన.
తనువు చాలించిన వినోద్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నర్సింగ్ పోలీసులు.
*సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదయగిరిలో పరిస్థితి ఉధృతం..
నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసిపి సస్పెన్షన్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మేకపాటికి ఫోన్ చేశారు. సుబ్బారెడ్డి గొంతు విన్న మేకపాటి ఫోన్ కట్ చేయడం జరిగింది.
* కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్
*అమరావతి: మంత్రి సీదిరి అప్పలరాజుకు సీఎం జగన్ పిలుపు.. కార్యక్రమాలు రద్దు చేసుకుని బయల్దేరిన సీదిరి
#apcmjagan #AndhraPradesh
మంత్రి పదవి ఉంటుందా ? పోతుందా ?
* హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైఎస్ షర్మిల.. షర్మిలను అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
CBI memo on SIT formation in vivekanandareddy case👆
*విజయవాడ : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై దాడి
మూడు రాజధానుల శిబిరం దగ్గర సత్యకుమార్ వాహనంపై రాళ్లతో దాడి
దుండగుల రాళ్ల దాడిలో కారు అద్దాలు ధ్వంసం – వాహనంతో ముందుకు దూసుకెళ్లిన సత్యకుమార్ డ్రైవర్ – విజయవాడ పార్టీ కార్యాలయానికి వస్తుండగా సత్యకుమార్ కారుపై దాడి
*అమరావతి : ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత – బీజేపీ నేత సత్యకుమార్ కారును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు – సత్యకుమార్ కారును అడ్డుకున్న ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు – సత్యకుమార్ కారు అద్దాలు పగలగొట్టిన వైసీపీ కార్యకర్తలు – మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైసీపీ – సత్యకుమార్ కారుకు అడ్డంగా నిలబడి నినాదాలు, ప్రతిఘటించిన బీజేపీ – పోలీసుల సాయంతో అక్కణ్ణుంచి వెళ్లిపోయిన సత్యకుమార్ – మూడు రాజధానుల శిబిరం వద్దకు చేరుకున్న ఎంపీ నందిగం సురేశ్