Movies

ఎన్టీఆర్ కు జ్వరం వచ్చిందని తెలిసి.. అల్లు రామలింగయ్య వైద్యం చేశారట తెలుసా?

ఎన్టీఆర్ కు జ్వరం వచ్చిందని తెలిసి.. అల్లు రామలింగయ్య వైద్యం చేశారట తెలుసా?

అయితే సాధారణంగా ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడటం లాంటివి చాలా తక్కువగా జరిగేది.ఎందుకంటే ఆయన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు.

అయితే ఆయన ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ అని చెప్పాలి.అలాంటి నందమూరి తారక రామారావు పరమానందయ్య శిష్యులు కథ అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మాత్రం అస్వస్థతకు గురయ్యారట.

కాగా అదే షూటింగ్లో లెజెండ్రీ నటలు అయినా నాగయ్య లాంటి వారు కూడా ఉండడం గమనార్హం.అయితే అనూహ్యంగా ఈ షూటింగ్ సమయంలో అన్నగారు అస్వస్థతకు గురి కావడంతో దర్శక నిర్మాతలు ఆందోళనలో పడిపోయారు.

షూటింగ్ ని పూర్తి చేయడం ఎలా అని భావించారట.అయితే అదే షూటింగ్స్ స్పాట్ లో ఉన్న ఒకప్పుడు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య వైద్యం కూడా చేయగలరు అన్న విషయం కేవలం ఒక్క నాగయ్యకు మాత్రమే తెలుసు.

ఆయన హోమియోపతి వైద్యం చేయడంలో ఎంతో నిపుణుడు అన్న విషయం నాగయ్యకు మినహా మిగతా ఎవరికి తెలియలేదు.ఈ క్రమంలోనే అస్వస్థతకు గురైన అన్న గారిని ఇక ఆసుపత్రికి తరలించాల వద్ద అన్న విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్లో పడిపోయారు.ఒకవేళ ఆసుపత్రికి తరలిస్తే షూటింగ్ ఆగిపోతుంది.ఒకవేళ తరలించకపోతే అన్నగారు మరింత అస్వస్థతకు గురై ఇబ్బంది పడే అవకాశం ఉంది.ఇలాంటి సమయంలోనే ఏం చేయాలో తెలియక అప్పుడు సీనియర్ నటుడిగా ఉన్న నాగయ్యను సలహా అడిగారట దర్శక నిర్మాతలు.ఈ క్రమంలోనే ఇక నాగయ్య అల్లు రామలింగయ్య కు చెప్పడంతో ఆయన నందమూరి తారక రామారావును నాడి చూసి వైద్యం అందించారు.

ఇక ఇలా అల్లు రామలింగయ్య అందించిన వైద్యంతో అన్నగారు కేవలం ఐదు నిమిషాల్లోనే మళ్లీ అస్వస్థత నుంచి బయటపడ్డారట.ఆ తర్వాత కాలంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అల్లు రామలింగయ్య గారి దగ్గరే సలహాలు సూచనలు తీసుకోవడం మొదలు పెట్టారట ఎన్టీఆర్.

ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఐన తరువాత కూడా అల్లు వారి వైద్య సలహాలు తీసుకునేవారట , ఒకరినొకరు బావ బావ అనుకుంటూ చాల చనువుగా ఉండేవారట.