🌹🙏కేతవరం, గుంటూరు జిల్లా..!!
🌸ఆంధ్ర దేశంలో నృసింహ క్షేత్రాలు మిక్కుటం.అందులో పంచ నారసింహ క్షేత్రాలు గా వేదాద్రి, మంగళగిరి, వాడపల్లి, మట్టపల్లి, కేతవరం ఉన్నాయి. కేతవరం తప్ప మిగిలిన నాలుగూ తేలిగ్గానే వెళ్ళిరావచ్చు.
🌸 ఇంచుమించు అన్నీ కృష్ణా పరీవాహక ప్రాంతంలోనే ఉన్నా కేతవరం మాత్రం కొంచెం సాహసించి వెళ్లాల్సిన ప్రదేశం!
కేతవరం నృసింహుడు కృష్ణ ఒడ్డున కొండపై వెలిసిన
స్వయంభువు! పక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారు.
🌸వర్షాకాలం ఈ స్వామి ని సేవించుకోవాలంటే మరీ కష్టం.
సరైన దారి ఇంకా ఏర్పాటు చేయలేదు.
విజయవాడ నుంచి వచ్చేవారు చిల్లకల్లు సెంటర్ లో హైవే దిగి రేబల్లె వెళ్లి అక్కడినుంచి పడవలో కృష్ణ దాటి కేతవరం చేరి సుమారు 200 మెట్లు ఎక్కితే స్వామి దర్శనం.
హైదరాబాద్ వాళ్ళు కోదాడ దగ్గర మేళ్ల చెరువు* నుండి రేబల్లె రావాలి.
🌸మేము మరో మార్గం లో అంటే వయా గుంటూరు, బెల్లం కొండ వచ్చి, అక్కడ నుంచి ముందుగా ఏర్పాటు చేయబడ్డ జీపు లో ( మామూలు కార్లు వెళ్లలేవు ) దాదాపు అరగంట ప్రయాణం చేసి డైరెక్ట్ గా కొండపైన ఆలయానికి చేరుకున్నాం.
ఇదొక దారి..కాకపోతే నిర్మానుష్యంగా అడవి మధ్య లో ఉంటుంది ప్రయాణం. కానీ ఈ ప్రయాణం చేసి తీరాల్సిందే! బాగుంటుంది.
🌸దారంట చేతులకు అందే బొప్పాయి 5లల్లుకుతోటలు, మిర్చి, మొక్కజొన్న పొలాలు, బంతి & చేమంతి వనాలు.
ఒక్కమాటలో చెప్పాలంటే వనాలు తప్ప జనాలు కనపడని ప్రదేశం!
మరో ముఫ్యానియన్స్ వజ్రాలు ..నిజమే..ఈ ప్రదేశం లో వజ్రాలు దొరుకుతాయని నానుడి! తీవ్రం గా వర్షం వచ్చినప్పుడు అక్కడి రాళ్లనుండి బైట పడతాయని చెప్పారు. మేము వెళ్లిన రోజు వర్షం పడిందిగానీ చిరుజల్లు మాత్రమే!
🌸బహుశా స్వామి వారు వజ్ర నఖ(గోళ్లు) నారసింహ కాబట్టి నఖాలు పెరిగినప్పుడల్లా ఆయన అక్కడ తీసిపడేస్తూ ఉంటాడు కాబోలు!! అవే వజ్రాలు గా దొరుకుతున్నాయని నా విశ్వాసం. పనిలేక గోళ్ళు గిల్లుకునేవారు అక్కడికి వెళితే వజ్రాలు దొరికే అవకాశం ఉంది
ఈ ఆలయ ఆర్చక స్వామి ప్రతి రోజూ రేబల్లె నుండి సొంత పడవ లో కృష్ణ దాటి కేతవరం వచ్చి అన్ని మెట్లూ ఎక్కి ఉదయం 9 నుండి 3 వరకు స్వామి సేవలో ఉంటారు.
🌸 రోజూ పట్టుమని పదిమంది పది రూపాయలు కూడా వచ్చే ఆలయం కాదది. అయినా నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో దీక్షగా తన బాధ్యతల నిర్వహణ లో లీనమవ్వడం చూసి ఎంతో ముచ్చటేసింది.
ఈ అర్చక స్వామి సంపూర్ణ దాసోహ లోగుట్టు ఆ పెరుమాళ్ళకే ఎరుక!
శని, ఆదివారాల్లో కొద్దిమంది భక్తులు వస్తూ ఉంటారట!
🌸యుగాల నాటి ఈ ఆలయాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత లేకపోగా ఎండోమెంట్స్ వారి పూర్తి అలక్ష్యం ఈ ఆలయ నిర్వహణ లో స్పష్ఠముగా కనిపిస్తోంది.
హడావుడిగా కాకుండా తీరిగ్గా ఈ క్షేత్రానికి వస్తే ఇటు ప్రకృతి ఒళ్ళో అటు పరమాత్మ గుళ్ళో కాలక్షేపమ్ చేసి మరీ వెళ్లొచ్చు.
🌹 నోట్ : …🌹
ఏమీ దొరకవు కాబట్టి Absolutely మంచి నీళ్లతో సహా తెచ్చుకోవాలి.