AP: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి వారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇవాళ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి విష్వక్సేన పూజ, కలశం ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ చేశారు.