NRI-NRT

నాట్స్ సేవా కార్యక్రమాలు భేష్: జయసుధ,ఆలీ

నాట్స్ సేవా కార్యక్రమాలు భేష్: జయసుధ,ఆలీ

నాట్స్ సేవా కార్యక్రమాలు భేష్: జయసుధ,ఆలీ
సాటి తెలుగువారికి సాయం చేయాలని నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సహజనటి జయసుధ అన్నారు. తెలుగు కళలకు, కళకారులకు నాట్స్ ఎంత గౌరవం ఇస్తుందనేని నాట్స్ సంబరాల్లో చేపట్టిన శత జయంతి ఉత్సవాలే నిదర్శనమని జయసుధ అన్నారు. అమెరికా తెలుగు సంబరాలకు తాను విచ్చేస్తున్నట్టు ఆమె తెలిపారు.
తెలుగువారికి అండగా నాట్స్ : ఆలీ
నాట్స్ ఏర్పడిన నాటి నుంచి తనకు నాట్స్‌తో అనుబంధం ఉందని ప్రముఖ నటుడు ఆలీ తెలిపారు. నాట్స్ ఆవిర్భావ వేడుకలకు అమెరికాకు వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నాట్స్ చేపట్టే కార్యక్రమాలకు తన మద్దతు ఉంటుందన్నారు. ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నందుకు నాట్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆ శత జయంతి ఉత్సవాల్లో తాను కూడా పాలుపంచుకోవడం అదృష్టమని తెలిపారు.

తెలుగు సంబరాలకు వెళ్తున్నందు సంతోషంగా ఉంది: చంద్రబోస్
తెలుగు భాష ప్రేమికులను, తెలుగు భాష సైనికులను అమెరికాలో కలుసుకోబోతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.

తెలుగు సంబరాలకు వెళ్లడం నా అదృష్టం: గోపిచంద్ మలినేని
నాట్స్ సంబరాల్లో ఎన్టీఆర్, ఘంటసాల, అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలు చేస్తున్న వేళ నేను ఆ సంబరాలకు వెళ్లడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.