Movies

అప్పటి దాకా గుర్తుంటాయా?

Sai Pallavi Will Be A Doctor After Retiring From Movies

డాక్టర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లని చాలామందిని చూశాం. సాయిపల్లవి కూడా ఆ జాబితాలో ఉంటుంది. తనకు వైద్యవృత్తి అంటే చాలా ఇష్టం. ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసింది. కానీ అనుకోకుండా సినిమాలవైపు అడుగులు పడ్డాయి. కానీ ఎప్పటికైనా డాక్టర్గా సేవలు అందిస్తానంటోంది సాయిపల్లవి. ‘‘నేనెప్పటికీ డాక్టర్నే. మా అమ్మానాన్నలు నన్ను అలానే చూడాలనుకున్నారు. చిన్నప్పటి నుంచీ నా కలలూ దాని చుట్టూనే తిరిగేవి. ఎప్పటికీ వైద్య వృత్తిని వదులుకోను. ప్రస్తుతం సినిమాల్ని, నటననీ ఆస్వాదిస్తున్నా. ఎంతకాలం ఈ రంగంలో ఉండగలనో అప్పటి వరకూ ఉంటాను. ఆ తరవాత వైద్యం చేస్తా. ఇటు సినిమా అటు వైద్యం అంటూ రెండు పడవల మీద కాళ్లు వేయడం నాకిష్టం లేదు. అందుకే సినిమాలకు దూరమయ్యాకే వైద్య వృత్తిలో స్థిరపడతా’’ అంది సాయిపల్లవి.