👉 న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమం కొనసాగిస్తాం…
నేడు గౌ||సియస్ గారిని విజయవాడ బందరు రోడ్డు లోని వారి క్యాంప్ కార్యాలయం లో కలిసిన అనంతరం బొప్పరాజు & పలిశెట్టి దామోదర్ రావు లు అక్కడే మీడియా తో మాట్లాడుతూ ….
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధానంగా ఆర్ధిక ఇబ్బందులుపైన, ఆర్ధికేతర సమస్యలు పైనా పిభ్రవరి 13 న సియస్ గారికీ ఇచ్చిన 50 పేజీల మెమోరాండలో అంశాలు పై నేటికీ ఎలాంటి స్పష్టత లేనందున, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలనే.. ఈ ఉద్యమం కొనసాగుతుందని…దానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని బొప్పరాజు & పలిశెట్టి దామోదర్ రావు లు తెలిపారు.
ఉద్యమ కార్యాచరణ ఫలితంగా…ప్రభుత్వం ఉద్యోగులనుండి వాడుకున్న డబ్బులు చెల్లింపులుచేసినప్పటికి, సదరు చెల్లింపులపై స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఇవ్వలని కోరడమైనది.
కానీ, ఇప్పటికే ప్రభుత్వం ఉద్యమం మొదలు పెట్టాక రెండు సార్లు చర్చలు జరిగినప్పటికీ, ఉద్యోగులకు చట్టప్రకారం ప్రభుత్వం చెల్లించాల్సిన 4- DA బకాయిలు, PRC arrears రెండూ ఆర్ధిక పరమైన అంశాలపై మొత్తం ఎంతచెల్లించాలి ? ఇప్పటివరకు ఎంత చెల్లించారు? ఇంకా ఎంత చెల్లించాలి? అనే దానిపై నేటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. కనుకనే, మలిధశ ఉద్యమకార్యచరణకు వెళ్లాల్సివస్తుందని శుక్రవారం గౌఃప్రభుత్వప్రధానకార్యదర్శిగారిని విజయవాడలో ఆయన క్యాంపుకార్యాలయంలో ఉద్యమకార్యచరణ షెడ్యూల్ నోటీసును అందజేసామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావులు తెలిపారు.
ఏపీ లో ఉద్యోగులు పై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యదోరణి వలన ఉద్యోగులు తీవ్రమైన ఆవేధనకు,అంసంతృప్తికి గురిఅయ్యే ఈఉద్యమాలకు సిద్దపడుతున్నారని.ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం ఉద్యోగులు కొత్త డిమాండ్లు పరిష్కరించమని చేస్తున్నది కాదని ఆకరికి గతంలో ఎన్నడూ లేని విదంగా ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు/పెన్షన్లు ఇవ్వండి మహాప్రభో అనే డిమాండ్ కూడా ఈ పోరాటం లోపెట్టలాల్సిన పరిస్దితి వచ్చినందుకు చింతిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసారు.
ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పట్ల చిత్తశుద్దితో వ్యవహరించి ఉద్యోగసంఘాల డిమాంఢ్లుపై నిజాయితీగా పరిష్కరిస్తూ ప్రధానంగా ఆర్టీకపరమైన విషయాలపై స్పష్టమైన హామీలతో టైమ్ షెడ్యూల్ ను లిఖితపూర్వకంగా ఇచ్చి, ఆర్దికేతర సమస్యలను వెంటనే పరిష్కరించగలిగితేనే అభద్రతా భావం, ఆందోళనా, ఆవేదనతో ఉన్న ఉద్యోగులు శాంత పడతారని అప్పుడే ఈఉద్యమానికి పరిష్కారం దొరుకుతుందని బొప్పరాజు & దామోదరరావు తెలిపారు.
శుక్రవారం సియస్ గారిని కలిసిన ఏపిజెఏసి అమరావతి నాయకులలో బి.కిశోర్ కుమార్, KP.చంధ్రశేఖర్, ఐ.యల్.నారాయణ, ఏ.సాంబశివరావు, యస్.మల్లేశ్వరరావు,
K.సుమన్, బత్తిన రామకృష్ట, D.శ్రీనివాస్, G.ప్రవీన్ కుమార్ రెడ్డి, చింతకాయల అప్పారావు తధితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలతో…
బొప్పరాజు & పలిశెట్టి దామోదరరావు