Editorials

ఏలినాటి శనిని తగ్గించే సూర్య దేవాలయం…!!

ఏలినాటి శనిని తగ్గించే సూర్య దేవాలయం…!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿 తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు వేర్వేరుగా తొమ్మది దేవాలయాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటే సూర్య దేవాలయం.

🌸 మిగిలిన అన్ని నవగ్రహ ఆలయాల్లో ప్రధాన దైవం శివుడు కాగా ఈ దేవాలయంలో సూర్యుడే ప్రధాన దైవం. ఇక్కడ సూర్యభగవానుడి వేడిని తగ్గించడానికి నవగ్రహాల్లో ఒకటైన గురుడు ఆ సూర్య భగవానుడికి ఎదురుగా ఉంటారు.

🌿 అదేవిధంగా శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది.

🌸రథసప్తమి సమయంలో పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్య దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి.

🌿సూర్యభగవానుడికి చక్రపొంగలి నైవేద్యంగా పెడుతారు. అదే చక్రపొంగలిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది .

🌸సూర్యుడు ప్రధాన దైవం అయితే ఒక్క సూర్యుడి దేవాలయంలో మాత్రం పరమశివుడు కాక సూర్యుడు ప్రధాన దైవంగా ఉంటాడు. అందువల్లే ఈ దేవాలయంలో సూర్యుడితో పాడు గురుడిని 12 ఆదివారాలు ఆలయంలోనే ఉండి కొలిస్తే ఏలినాటి శని వదులుతుందని భక్తుల నమ్మకం.

🌿 స్థలవాసం
ఆలయంలో భక్తులు ఉండటానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా ఆలయంలోనే ఉండి పూజలు చేయడాన్ని స్థలవాసం అంటారు. ఈ స్థలవాసం చేయడానికి దేశంనలుమూలల నుంచి ఎంతో మంది నిత్యం ఇక్కడకు వస్తూఉంటారు

🌸 కుళోత్తంగ చోళుడు
ఇక ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతమున్న ఆలయాన్ని కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. అటు పై విజయనగర రాజుల కాలంలో అభివ`ద్ధి చెందింది. ఐదు అంతస్తుల రాజ గోపురం, ఉట్టూ గ్రానైట్ తో నిర్మించిన ప్రహరీగోడ ఉంటుంది.

🌿 ఉషా, ఛాయా దేవతలు
ఇక ఆలయ గర్భగుడిలో మధ్యలో సూర్యభగవానుడు కొలువై ఉండగా అటుపక్కా ఇటు పక్కా ఉషా, ఛాయా దేవతలు ఉంటారు. సూర్యుడు వేడికి చిహ్నం. ఆయన ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది.

🌸 నవగ్రహాల్లో ఒకటైన గురువు
ఆ వేడి వాతావరణాన్ని చల్లబరచడానికి అన్నట్లు ఇక గర్భగుడిలోనే సూర్య భగవానుడికి ఎదురుగా నవగ్రహాల్లో ఒకటైన గురువు ఉంటాడు.

🌿అందువల్ల సూర్యుడి వేడి కొంత తగ్గి ఉంటుందని భక్తుల నమ్మకం. సూర్యుడి రథాన్ని లాగేది గుర్రాలు.

🌸 సూర్యుడి విగ్రహానికి ఎదురుగా గుర్రం అందువల్లే శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది.

🌿 ఆలయంలో సూర్యుడు పటమర ముఖంగా ఉంటాడు. రెండు చేతుల్లో కలువపువ్వులతో ప్రసన్న వదనంతో భక్తులకు సూర్య భగవానుడు దర్శనమిస్తాడు.

🌸రథ సప్తమి రోజు
రధసప్తమి సమయంలో పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్య దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి.

🌹ఆలయ పురాణ గాధ…🌹

🌿కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు.

🌸ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ కన్నెర్రజేస్తాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీప్రాంతానికి వెళ్ళమని శపిస్తాడు.

🌿దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారుడైన పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి చేస్తాడు.

🌸అంతేకాకుండా, వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటే వారికి బాధలు ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు.

🌿సౌర ప్రలోభాల వ్యవధి ఆరు సంవత్సరాలు. ‘సాటర్న్’, శని, అష్టమశిని లేదా ఏలినాటిశని మరియు జన్ శని గ్రహాల ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తున్న వారు సూర్య భగవానుని సందర్శించి పూజలు చేయటం ద్వారా వారి కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు.

🌸సూర్యభగవానుడితో పాటు గురుడుని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు…స్వస్తి…🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿