• విస్తుగొలిపేలా జయలలిత ఆస్తులు • విక్రయానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం
బెంగళూరు: ఆక్రమా ర్జన కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత నుంచి స్వాధీనం చేసు కున్న చరాస్తుల్ని విక్రయిం చేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయ వాది కిరణ్ ఎస్ జావలిని కర్ణాటక ప్రభుత్వం నియమించింది. 1996 నాటి అక్రమార్జన కేసును సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2003లో తమిళనాడు. నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. సాక్ష్యాల రూపంలో 1996లో చెన్నైలోని జయ నివాసం నుంచి స్వాధీనపరచుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 7 కిలోల బంగారం/ వజ్రాభరణాలు, 600 కిలోల వెండి ఆభరణాలు, 11 వేలకు పైగా చీరలు, 750 జతల పాదరక్షలు, 91 చేతి గడియారాలు, 131 సూట్ కేసులు, 1,040 వీడియో క్యాసెట్లు, ఏసీలు, ఫ్రిజ్లు, విద్యుత్తు పరికరాలు ఉన్నాయి.