CM KCR | తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
CM KCR | తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను తెరవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సీజన్లో 7వేల కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా అధికారులకు కొనుగోళ్లను తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేయనున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించిన పంట దళారులకు విక్రయించి మోసపోకుండా.. మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏటా దాదాపు 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి గ్రేడ్ వన్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం ప్రకటించింది.