Politics

విశాఖ ఉక్కుపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. ఏమన్నరాంటే

విశాఖ ఉక్కుపై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. ఏమన్నరాంటే

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్‌ను పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య వాగ్వాదానికి కారణంగా మారిందీ వివాదం. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై తాజాగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్‌ సింగ్‌ కులస్తే కీలక…

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్‌ను పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య వాగ్వాదానికి కారణంగా మారిందీ వివాదం. ఇదిలా ఉంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై తాజాగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్‌ సింగ్‌ కులస్తే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటు పరం చేయాలనుకోవడం లేదని, దీనిపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదని ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి కాస్త ఫుల్‌ స్టాప్‌ పడుతుందని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర సహాయ మంత్రి చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని పవన్‌ కళ్యాణ్‌ అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి ప్రకటన ఆశాజనకంగా ఉందన్న పవన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దీనిపై పవన్‌ బహిరంగ లేఖను విడుదల చేశారు. విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ. 32 మంది ప్రాణ త్యాగాలతో… ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్షని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షాకు తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరినట్లు పవన్‌ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారన్న పవన్‌… ఇందులో కొందరికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదన్నారు. ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశాం. అయినా వైసీపీ పాలకులు స్పందించలేదని పవన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.