🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
ఈ ఆలయం లో మూల విరాట్టు 10 అడుగుల త్రివిక్రమ పెరుమాళ్. దారు కలపతో చేసినది. మరి యెచ్చట కలపతో చేసిన విగ్రహము తమిళనాడులో లేదు.
ఈ క్షేత్ర గోపురం తమిళ్ నాడులో అతి పెద్ద గోపురములలో శ్రీరంగము, శ్రీవిల్లిపుత్తూరు తరువాత పెద్దది.
కోవిల ప్రాంగణము 5 ఏకరములలో విస్తరించి ఉన్నది.
ముఖ్య గోపురము దాటిన తరువాత కూడా ప్రజల నివాసములు ఉన్నవి. ఈ క్షేత్రమును నాడు నాడు తిరుపతి అని ప్రసస్తి.
వామన మూర్తి పెరుమాళ్ తిరుకక్కరాయి (త్రికక్కర) కేరళ లో దర్శనము. ఇచ్చట వామనమూర్తి త్రివిక్రమ పెరుమాళ్ విగ్రహము వెనక నుండి భక్తులను అనుగ్రహిస్తారు.
వామన-త్రివికృమ అవతారముల ఉద్ధేశము అహంకారము దురహంకారము గర్వముతో వేగే వారికి మహారాజులయిన గుణ పాఠము నేర్పుటకు.
విశ్వరూపము ధరించి వామ కాలుతో పృధ్వీని, కుడికాలు తో ఆకాశమును కొలిచి భూమి ఆకాశమును తాకుతూ నిలిచేను. ఖ్యాతి గాంచిన ప్రహ్లాదుని మనవడైన మహాబలి చక్రవర్తి ని ఆహ్లాదముతో దీవించుటకు తారుమారు అయిన శంఖు కుడి చేతిలో మరియు చక్రము వామ హస్తములో దర్శనము.
ఇది భక్తులకు జ్ఞానమును వర్ణించుటకు.
వామ కాలు ఆకాశముపై కుడి కాలు పృధ్వీ పై వేసి మహాబలి దానమిచ్చిన మూడో అడుగు ఎచ్చట వేయవలెనని అడుగుతున్నట్లు బ్రహ్మ కుడికాలు ని ఆకాశములో పూజిస్తునట్లు దర్శనము.
మృకండు ముని విష్ణుమూర్తి ఈ విశ్వరూప దర్శనము చేసుకొనుటకు ఇష్టపడి బ్రహ్మ వద్దకు పోయి అడిగెను. బ్రహ్మ ఆయనను కృష్ణభద్ర నది తీరమున ఉన్న పంచ కృష్ణ క్షేత్రమునకు పోయి విష్ణు మూర్తి గురుంచి తపస్సు చేయమనెను. మృకండు ముని తన భార్య మిత్రవతి తో విశ్వరూప దర్శనము కొరకు తపస్సునాచరించెను.
భగవంతుడు వీరి కుటీరమునకు ముదుసలి బ్రాహ్మణనుగా వచ్చి ఆహారము అర్ధించేను. వీరి వద్ద వరి గింజ కూడా వృద్ధ బ్రాహ్మణునికి ఇచ్చుటకు లేక ముని భార్య వంక చూసెను. మిత్రవతి ఒక పాత్ర తీసుకొని నారాయణుని తానే పతివ్రతనైతే ఆ పాత్ర నిండుగా ఆహార పదార్ధములను ఇమ్మని కోరేను. పాత్ర రుచికరమైన పాకములతో నిండెను. వాటిని ఆ ముదుసలి బ్రహ్మణుణికి ఇచ్చేను. నారాయణుడు వీరి భక్తికి మెచ్చి వీరికి విశ్వరూప దర్శనమిచ్చేను.
భగవంతుని కృప వల్ల ఈ క్షేత్రములో (ముదలాళ్వార్లుగా ప్రఖ్యాతి పొందిన) పోయిగై ఆళ్వార్, పూతత్తాళ్వార్ మరియు పేయాళ్వార్ కలిసిరి.
కుండపోత వర్షము పడుతున్నందున పోయిగై ఆళ్వార్ మృకండు ముని ఆశ్రమములో స్థలము అడిగెను. మృకండు ఆశ్రములో ఇద్దరు విశ్రమించుటకే స్థలము ఉన్నదని చెప్పి ఆశ్రమిచ్చెను. మరికొంత సమయము గడిచిన పిమ్మట పూతత్తాళ్వార్ మృకండు ముని ఆశ్రమునకు వచ్చి విశ్రమించుటకు స్థలమడిగెను. మృకండు ముని ఇద్దరు విశ్రమించుటకే స్థలము ఉన్నది, ముగ్గురైన కూర్చోనడానికే స్థలము కలదు అని ఆశ్రమమిచ్చేను. మరికొంత సమయము గడిచిన పిమ్మట పేయాళ్వార్ కూడా స్థలమడిగెను. మృకండు ముని ముగ్గురుకి నిలబడుటకే స్థలమున్నది అని చెప్పి ఆశ్రమమిచ్చెను. వారు ముగ్గురు మృకండు ముని ఆశ్రమము లో నిల్చుని ఉండగా నాల్గవ వ్యక్తి కూడా చెరి వారి ముగ్గురుకు స్థలము సరిపోవనందున చూడ పెరుమాళే వారికి లక్ష్మి దేవితో దర్శనమిచ్చేను.
ఈ ఆళ్వార్లు ముగ్గురు వారికి పెరుమాళ్ ఆ వర్షపు రాత్రి చీకటి లను పారద్రోలే దీపపు కాంతి వలె దర్శనమిచ్చేనని వరసగా ముదల్ తిరువందాది.ఇరండాం తిరువందాది, మూంన్ఱాం తిరువందాది పాశురాములను కూర్చెను.
ఈ పాశురాములను భక్తులు ఇప్పటికినీ దీపములు వెలిగించునప్పుడు గానము చేయుదురు. ఈ ముగ్గురు ఆళ్వార్ (ముదల్ ఆళ్వారులు) ఇచ్చటనే మోక్షము పొందిరి.
ఇచ్చట పెరుమాళ్ మూడడుగుల స్థలము అడిగెనని ఉలగలంద పెరుమాళ్ గా స్తుతించబడేను.
ఈ క్షేత్రములోని పెరుమాళ్ విగ్రహము భారతదేశములో అన్నిటి కన్నా పెద్దది దారు కలపతో చేయబడినది. శంఖు చక్రములు ఐహిత్యముగా కాకుండా కుడి ఎడమైనవి. శంఖము కుడి చేతిలో, చక్రము ఎడమ చేతిలో.
108 దివ్య దేశములలో స్వయంబు విష్ణు దుర్గ కోవిల ఇది ఒక్కటే. శుక్రా చార్యునికి ఈ క్షేత్రములో స్థానము కలదు. ముఖ్యము గా విష్ణు దుర్గ సన్నిధి శివుని ఆలయము లో ఉండును. కానీ ఈ క్షేత్రములో ఆలయ ప్రాకరములో పెరుమాళ్ సన్నిధికి సమీపమున ఉన్నది. భక్తులు రాహు కాలము లో మంగళవారము మరియు శుక్రవారము పూజింతురు.
పన్నెండ్రు ఆళ్వార్లు పెరుమాళ్ ని వేర్వేరు స్థలములలో, సమయములలో స్తుతించిన 4000 పవిత్ర పాశురములు ఈ క్షేత్రములో ఒక దరి చేర్చబడినవి. తిరుమంగై ఆళ్వార్ పెరుమాళ్ నే తన పాశురాములతో స్తుతించును కానీ ఇచ్చట విష్ణు దుర్గ ని కూడా తన ఒక పాశురములో ప్రస్తుతించేను.
ఈ క్షేత్రములో కృష్ణభగవానుని విగ్రహము సాలగ్రామ శిలతో చేయబడి గోపురము కుడి పక్కన సన్నిధిలో భక్తులను నిత్య సాన్నిధ్యము తో అనుగ్రహించును. ఈ క్షేత్రములో భక్తులు కృష్ణుని దర్శించి పిమ్మట పెరుమాళ్ ని దర్శించవలెను. మాణవాల మమునిగలు పెరుమాళ్ ని స్తుతిస్తు అనేక కీర్తనలు చేసెను…సేకరణ…🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿