ఈ ముత్యం బరువెంతో తెలుసా? 27 కిలోలు. అంత పెద్ద ముత్యం ఉందంటే నమ్మశక్యంగా లేదు కదా! ఇది మామూలు ముత్యం కాదు మరి. వారసత్వ సంపదగా ఒకరి నుంచి మరొకరికి వచ్చిన ముత్యం తెలుసా?కెనడాకు చెందిన ఫిలిపినో అబ్రహాం రెయెస్ దగ్గర ఉన్నది. ఇది ఆయనకు వాళ్ల అత్త నుంచి వారసత్వంగా సంక్రమించింది. 1950లో అబ్రహాం రెయెస్ వాళ్ల తాత ఫిలిప్పీన్స్‌లో ఒక భారీ ఆల్చిప్పను కనుగొన్నాడు. ఇందులో మొలస్కా జాతి జీవులు ఆల్చిప్పలో ఇరుక్కుపోయాయట. అయితే ఆ ఆల్చిప్ప లోపల ఇంత పెద్ద ముత్యం ఉందనే విషయం మొదట ఆయన కూడా గ్రహించలేదు. కొన్నాళ్లకు ఆల్చిప్పలో ఉన్న ముత్యం బయటపడింది. దీని ధర వింటే ఆశ్చర్యం కలుగకమానదు. ఈ ముత్యాన్ని దక్కించుకోవడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేసి, విఫలమయ్యారు. రెయెస్ దీని గురించి అందరూ తెలుసుకోవాలనే ఆలోచనతో ఓ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాడు. ఇటువంటి అరుదైన ముత్యానికి ఉన్న చరిత్రను అందరూ తెలుసుకునేలా ఏర్పాట్లు చేశాడు. దీని విలువ రూ.1,400 కోట్లపైనే ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. నిపుణుల ధ్రువీకరణ తర్వాత దీని విలువను బీమా సంస్థలు లెక్కగట్టాయి. కెనడాకు చెందిన వారు దీని విలువను రూ. 400 కోట్ల నుంచి రూ. 600 కోట్ల మధ్య ఉంటుందని నిర్ధారించారు. హాంకాంగ్‌కు చెందిన బీమా సంస్థ దీని విలువను రూ. 1,000 నుంచి 1,400కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది.
27కిలోల అతిపెద్ద ముత్యం
Related tags :