పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.సౌత్ లో ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్ ఒక్క పవర్ స్టార్ కు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరి ఈయన ఫ్యాన్స్ పవన్ నుండి ఎలాంటి సినిమా కోరుకుంటారో అందరికి తెలుసు.ఫుల్ యాక్షన్ తో పాటు గన్స్, బులెట్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి ఫుల్ పవర్ ప్యాక్డ్ తో ఉన్న సినిమాను కోరుకుంటారు.
అయితే అలాంటి సినిమా పవన్ నుండి వచ్చి చాలా రోజులే అవుతుంది.ఇక రాదు కూడా అనుకున్న సమయం లోనే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఫుల్ ప్యాక్ ను రెడీ చేస్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ).ఈ డైరెక్టర్ గత సినిమా సాహో లో ప్రభాస్( Prabhas in Saaho ) ను ఏ రేంజ్ లో చూపించాడో అందరం చూసాము.మరి ఇప్పుడు అలాంటి టాలెంట్ తోనే పవర్ స్టార్ ను కూడా చూపించ బోతున్నాడు
ఈయన టాలెంట్ కు ఫిదా అయ్యే పవన్ కళ్యాణ్ ప్లాప్ ఉన్న కూడా ఓకే చేసాడు.మరి నిన్నటి వరకు కొద్దిగా అనుమానాలు అయితే ఫ్యాన్స్ పెట్టుకున్నారు.పవన్ కళ్యాణ్ ట్యాలెంట్ కు తగ్గ సినిమా ఇదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఎందుకంటే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేయగా ఈ వీడియో నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి.
ఈ చిన్న వీడియో లోనే యాక్షన్ గాని వైలెన్స్ గాని ఏ లెవల్లో ఉంటాయో సుజీత్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది.ఈ సినిమా సుజిత్ కంప్లీట్ చేస్తున్నట్టుగా ఒక ఫుల్ పవర్ ప్యాక్డ్ వీడియోని మేకర్స్ లాంచ్ చేసారు.ఓజి అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లిమ్స్ తోనే ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసి వారిని ఫిదా చేసాడు.దీంతో సుజీత్ మాస్ సంభవం పట్ల ఫిదా అవుతున్నారు.ముందు ముందు ఈ సినిమా నుండి ఎలా అప్డేట్స్ ఉంటాయో చూడాలి.