NRI-NRT

తానా ఆధ్వర్యంలో “కాశీ” గంగా పుష్కరాల్లో అన్నదానం..

తానా ఆధ్వర్యంలో “కాశీ” గంగా పుష్కరాల్లో అన్నదానం..

అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధ్వర్యంలో కాశీ గంగా పుష్కరాలలో పెద్ద ఎత్తున యాత్రికులకు అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వర్జినియాకు చెందిన ప్రవాస ఆంధ్ర ప్రముఖుడు ఉప్పుటూరి రామ్ చౌదరి సారధ్యంలో అన్నదానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తానా సభ్యులు పలువురు దీనికోసం విరాళాలను అందజేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ యాత్రికులకు మంచినీళ్ల బాటిల్స్ అందించడం కోసం నిధులను సమకూర్చారు.

కాశీలోని పంచ నిర్వాన్ ఘాట్ లోని అక్కడా ఆశ్రమాన్ని అన్నదానం కోసం ఎంపిక చేశారు. రోజుకు 1000 మంది వరకు అన్నదానం చేయాలని సంకల్పంతో రామ్ చౌదరి సారధ్యంలోని వాలంటీర్ల బృందం పెద్ద ఎత్తున ఏర్పాటు లు చేస్తున్నారు కాశీలో ఉంటున్న సోమా కంపెనీ జనరల్ మేనేజర్ పి ఎస్ ఆర్ కోటేశ్వరరావు తో పాటు ఆయన సహచరులు తమ సహకారాన్ని అందిస్తున్నారు