భూదేవి కాంప్లెక్సులో దివ్యదర్శన టోకెన్లు జారీ
శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ సత్రాల్లో ఎస్ఎస్ఓ టోకెన్లు శ్రీవారి దర్శనానికి అలిపిరి మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యద ర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపి ఈ టోకెన్లు పొందవచ్చు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలోని గాలి గోపురం 2,083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారిని దివ్యదర్శన లైన్లో కాకుండా టైంస్లాట్ సర్వదర్శన క్యూలైన్లో మాత్రమే అనుమతిస్తారు. గతంలో గాలిగోపురం వద్దనే ఇచ్చే దివ్యదర్శన టోకెన్లను తాజాగా భూదేవి కాంప్లెక్స్‌కు మార్చిన విషయాన్ని భక్తులు గుర్తించాలని ఆదివారం టీటీడీ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీని వాసం, రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్ వెనుకభాగంలోని గోవిందరాజ సత్రాల్లో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్ఓ) టోకెన్లు జారీ చేస్తున్నారు.