Sports

వేగంగా 20వేల పరుగుల రికార్డు

Virat Kohli Scores 20000 Runs In International Cricket - Becomes The Fastest Cricketer To Do So

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. 20 వేల అంతర్జాతీయ పరుగుల మార్కును వేగవంతంగా సాధించిన రికార్డును కోహ్లి నమోదు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 37 పరుగుల దూరంలో ఉన్న కోహ్లి దాన్ని అందుకున్నాడు. దాంతో 417 ఇన్నింగ్స్‌ల్లో 20 వేల అంతర్జాతీయ పరుగులు(టెస్టులు, వన్డేలు, టీ20లు) సాధించి ‘ఫాస్టెస్ట్‌ రికార్డు’ నమోదు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారాల పేరిట సంయుక్తంగా ఉంది. వారిద్దరూ 20 వేల అంతర్జాతీయ పరుగుల్ని 453 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, దాన్ని కోహ్లి తాజాగా బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్‌(464 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్‌(483) నాల్గో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌(492 ఇన్నింగ్స్‌లు) ఆరో స్థానంలో ఉన్నాడు.