🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿మాఘమాసం మఖా నక్షత్రం రోజున కుంభకోణంలో అతి పెద్ద ఉత్సవాన్ని చాలా ఘనంగా వైభవంగా జరుపుతారు. కుంభకోణం
మహామహం పుష్కరిణిలో స్నానం చేస్తే మరుజన్మ లేకుండా ముక్తి లభిస్తుంది అని అంటారు.
🌸ఈ ఉత్సవాల సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు దేశం నలుమూలలనుండి తరలి వచ్చి పవిత్రపుష్కర స్నానాలు ఆచరిస్తారు.
🌿యీ పుష్కరిణి ని కృత యుగంలో “బ్రహ్మ తీర్ధ”మని, త్రేతాయుగంలో “పాపనాశ తీర్ధం” అని
ద్వాపర యుగంలో “ముక్తితీర్ధం” అని కలియుగంలో “కణ్ణియర్”
తీర్ధమని పిలువ బడుతోంది.
యిప్పుడు మహా మహ కుళం అని కూడా అంటారు.
🌸యీ తీర్ధం నాలుగు ప్రక్కలా పదహారు శివలింగ మండపాలు వున్నాయి. భక్తులు యీతీర్ధం లో స్నానం చేసి షోడశ లింగ దర్శనం చేసుకుని తరిస్తారు. యీ తీర్ధం లో స్నానం చేసి ,శివలింగాల దర్శనం చేసుకుంటే కోల్పోయిన సిరిసంపదలు
తిరిగి లభిస్తాయని భక్తుల నమ్మకం.
🌹1. పుష్కరిణి 🌹
🌿ఉత్తరపు ఒడ్డున బ్రహ్మ తీర్ధేశ్వరర్, ముకుందేశ్వర్,ధనేశ్వర్,వృషభేశ్వరర్ మొదలైనవారున్నారు.
సిరిసంపదలకై యీ ఈశ్వరుని ఆరాధిస్తారు.
🌸ఉత్తర తూర్పు ఈశాన్యంలో ‘బాణేశ్వరుడు’ వున్నాడు.
యీయనను ఆరాధిస్తే
వ్యాపారాభివృధ్ధి కలిగి
లక్ష్యాలను సాధించగలుగుతారు.
🌹🙏2. తూర్పు వైపు ఒడ్డున
‘కోణేశ్వరుడు’🌹🙏
‘🌿భక్తనేశ్వరుడు ‘ వుంటారు.
వీరిని ఆరాధిస్తే నూతన కార్యాచరణలో కలిగే అడ్డంకులు తొలగుతాయి.
🌸దక్షిణ తూర్పు న వున్న ‘భైరవేశ్వరుని’ కొలుస్తే సర్వదా రక్షణ కలుగుతుంది.
🌹🙏3. దక్షిణపు ఒడ్డున, అగస్త్యేశ్వరుడు,వ్యాసేశ్వరుడు,🙏🌹
🌿ఉమామహేశ్వరుడు .
వీరిని పూజిస్తే పునర్జన్మ వుండనే వుండదని చెపుతారు.
🌸దక్షిణ పడమటి దిశలో ని
‘నైఋతేశ్వరుని’ ప్రార్ధిస్తే
మేధా శక్తి పెరుగుతుంది.
4.పడమటి ఒడ్డున వున్న
‘బ్రహ్మేశ్వరుణ్ణి,’ ‘🙏
🌿రంగనాధేశ్వరుని’ పూజించిన దీర్ఘాయువు లభిస్తుంది.
🌸ఉత్తర పడమట వున్న
క్షేత్రపాలకుణ్ణి పూజిస్తే
పుష్కరిణి లో స్నానం చేసిన పుణ్యఫలమును
జీవితాంతం లభించేలా చేసి
పాపాలనన్నింటిని హరిస్తాడని
చెప్తారు.
🌿ఒకప్పుడు
రఘు నాయకుడనే ఒక మహారాజు యీ మహామహం పుణ్యదినాన యీపుష్కరిణిలో పవిత్రంగా స్నానం చేసి,తను తులాభారం
తూగిన బంగారాన్ని,
🌸 గోవింద దీక్షితర్ అనే జ్ఞానికి దానంగా సమర్పించగా ఆయన ఆ బంగారాన్ని అమ్మివేసి వచ్చిన ధనంతో పుష్కరిణి చుట్టూవున్న ఆ షోడశ
శివలింగ మండపాలను,
నిర్మించినట్లు చెప్తారు.
🌿భక్తులు తమ కోరికలు నెరవేరడానికి యధాశక్తిని యీ శివ లింగముల ముందు , ధన ధాన్యాలను,బంగారాన్ని,
పశుసంపదలని,పండ్లు,
తాంబూలములను
దానమివ్వాలని అంటారు.
🌸పుష్కరిణి ఒడ్డున కాశీ విశ్వనాధుని ఆలయం , మరి కొన్ని ఆలయాలు
వున్నాయి.
🌿కాశీ విశ్వనాధుని ఆలయంలో
నవ నదులైన 1.గంగా 2.యమున 3.కావేరి 4.సరయూ 5.గోదావరి
6.సరస్వతి 7.నర్మద 8.కృష్ణా 9. తుంగభద్ర,
🌸యీ నదుల శిలారూపాలు వున్నాయి.యీ నదీ జలాలు యీపుష్కరిణిలో కలిసాయంటారు.
🌿యీ కన్యకల రూపంలో వచ్చి, తమలో కలసిన భక్తుల పాపాలని యీ తీర్ధం లో స్నానం చేసి పోగొట్టుకున్నారని ఐహీకం. ఈ పుష్కరిణి లో పంధొమ్మిది తీర్ధాలు వున్నాయి.
🌸1.వాయు తీర్ధం లో స్నానం చే స్తే
వ్యాధులు నయమౌతాయి.
🌿2.గంగాతీర్ధం ప్రశాంతమైన
మరణాన్నిస్తుంది.
🌸3. బ్రహ్మతీర్ధంలో స్నానం చేసిన మన ముందు తరం వారు చేసిన పాపాలు మనన్ని వెన్నంటవు.
🌿4.యమునా తీర్ధ స్నానం వలన బంగారు ఆభరణాలు చేరతాయి.
🌸 5.కుబేర తీర్ధ స్నానం సకల ఐశ్వర్య సిధ్ధి కలిగిస్తుంది.
🌿 6. గోదావరి నదీ స్నానం కోరికలు
యీడేరతాయి.
🌸7. ఈశాన్య తీర్ధ స్నానం
శివ పద ప్రాప్తి కలిగిస్తుంది.
ఈ విధంగా ఒక్కొక్క తీర్ధానికి ఒక్కొక్క పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం..స్వస్తి..🚩🌞🙏🌹🎻