సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వరుడు, వధువు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరి చెంప మరొకరు చెళ్లుమనిపించారు. క్షణాల్లోనే ఆ పెళ్లి రసాభాసగా మారింది.
న్యూఢిల్లీ: సాధారణంగా వధువు, వరుడు పెళ్లి పీటలపై నర్వస్‌గా కనిపిస్తుంటారు. పెళ్లి తంతు, నిద్రలేమి వంటి కారణాలతో పేలవంగా ఉంటారు. అయినా, చాలా యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రతి క్షణం ఎంతో అప్రమత్తతో ఉంటూ ఫొటోలు, వీడియోల్లో అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా మెలుగుతారు. కానీ, ఈ జంట మాత్రం పెళ్లి మండపంలో ఉండాల్సిన వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఒకరిపై ఒకరు చేజేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లూ కామెంట్లతో పేలుతున్నారు.
ఆ వీడియో ప్రకారం, వరుడు.. వధువుకు స్వీట్ తినిపించడానికి చేయి ముందుకు చాచాడు. ఆమె పెదవుల వద్దకు తీసుకెళ్లాడు. కానీ, వధువు మాత్రం అయిష్టంగా తలను వెనక్కి తీసుకుంది. వరుడు ఆ సంకేతాన్ని పట్టించుకోకుండా ముందుకే చేయి చాచి నోటిలో కుక్కే ప్రయత్నం చేశాడు. వధువు ఒక్కసారిగా ఫైర్ అయింది. వరుడి చేతిని దూరంగా నెట్టేసింది. అంతటితో ఆగకుండా వరుడి చెంప చెళ్లుమనిపించింది.