గంగా పుష్కరాల సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధ్వర్యంలో భారీ ఎత్తున శనివారం నాడు అన్నదానాన్ని ప్రారంభించారు. పుష్కరాల ప్రారంభ సందర్భంగా స్థానిక శివాల ఘాట్లో ఈ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజున ఊహించని విధంగా అన్నదానానికి భారీ సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు. దాదాపు 800 మంది కి తొలి రోజున పది పదార్థాలతో కూడిన చక్కటి భోజనాన్ని అందించారు.
కాశీలోని అన్ని ఘాటుల్లో పులిహోర పెరుగన్నం ప్యాకెట్లు పంచుతూ శివాల ఘాటుకు వచ్చిన వాసవి సంస్థ ప్రతినిధులు శివాల ఘాట్లో తానా అన్నదాన శిబిరానికి హాజరై భోజనం చేశారు. మంచి భోజనాన్ని అందిస్తున్న తానా సంస్థ ను అభినందించారు. ఆదివారం నుండి వెయ్యి మందికి పైగా యాత్రికులకు తానా శిబిరంలో అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుండి రాత్రిపూట అల్పాహారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.