Movies

యంగ్ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక.. నిజమేనా..?

యంగ్ హీరోని రెండో పెళ్లి చేసుకోబోతున్న నిహారిక.. నిజమేనా..?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుండి ఇంతవరకు అమ్మాయిలు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వలేదు. కానీ నిహారిక మాత్రం ఆ ధైర్యం చేసి యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.ఇక జోన్నలగడ్డ చైతన్యతో పెళ్ళయ్యాక నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పి వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ ప్రొడ్యూసర్ గా మారింది. ఈ మధ్యనే నిహారిక పింక్ ప్రొడక్షన్ హౌస్ ని హైదరాబాదులో ప్రారంభించింది.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి నిహారిక (Niharika) చైతన్యతో విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు తగ్గట్టుగానే నిహారిక చైతన్య ఇద్దరు తమ సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలు డిలీట్ చేసి ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతే కాకుండా నిహారిక చైతన్య (Chaithanya) తో ఎక్కడ కూడా కనిపించడం లేదు. దాంతో వీరు విడాకుల వార్తలు కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు.అయితే తాజాగా నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

నిహారిక రెండో పెళ్లి చేసుకోబోయేది యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai dharam tej) అంటూ ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే సాయి ధరమ్ తేజ్ వరుసకి నిహారిక కి మేనబావ..అన్ని బాగుంటే నిహారిక సాయి ధరంతేజ్ ఇద్దరు పెళ్లి ద్వారా ఒకటయ్యేవారు.కానీ సాయి ధరంతేజ్ కి చిన్నప్పటి నుండి నిహారికను చూస్తూ పెరగడం వల్ల నిహారిక (Niharika) పై అలాంటి ఫీలింగ్ రాకపోవడంతో వీరి పెళ్లి జరగలేదు.

కానీ తాజాగా నాగబాబు (Naga babu) తన కూతుర్ని సాయిధరమ్ తేజ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని, అలా చేస్తే తన కూతురు తన కళ్ళముందే ఉంటుందనే ఉద్దేశంతో నిహారిక ని మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.కానీ ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు మాత్రం కొంతమంది మెగా హేటర్స్ కావాలనే మెగా ఫ్యామిలీ పరువు తీయాలని ఇలాంటి రూమర్స్ పుట్టిస్తున్నారు.అలాంటిదేమీ లేదు అంటూ నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజం ఏంటో మెగా ఫ్యామిలీకే తెలియాలి.