NRI-NRT

గల్ఫ్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కువైత్‌లో మినీ మహానాడు సన్నాహాలు

గల్ఫ్‌లో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కువైత్‌లో మినీ మహానాడు సన్నాహాలు

పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు నివసిస్తున్న గల్ఫ్ దేశాలలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఒక వైపు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా ప్రతివారం ఏదో ఒక కార్యక్రమం జరుగుతుండగా.. మరోవైపు ఇటీవల టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను గల్ఫ్ దేశాల్లోని టీడీపీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పార్టీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, యూఏఈ దేశాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులు పాల్గొని, అధినేత చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలను అట్టహాసంగా చేపట్టారు. గల్ఫ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాగా అందులో తెలుగు దేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, చంద్రబాబు నాయకత్వంలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, పార్టీకి ఎన్నారైలు అందించాల్సిన సేవలపై ప్రధానంగా చర్చించారు. తెలుగునాట అన్న ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి పరిస్థితులు, తెలుగువారి అభ్యన్నతికి పార్టీ అందించిన సేవలు, నారా చంద్రబాబునాయుడు పరిపాలనా దక్షత, దూరదృష్టి, ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ అభివృద్దితో పాటు విభజిత ఏపీలో అమరావతి, పోలవరం, సంక్షేమ రంగాల్లో విశిష్ట సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. 2024లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలను చర్చించి పలు తీర్మానాలు రూపొందించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అధినేతకు జన్మదిన శుభాకంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రావి రాధకృష్ణ మాట్లాడుతూ.. ఏపీలో ప్రస్తుతం అరాచక పాలన రాజ్యమేలుతుందని, ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులతో భయపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆంధ్రాలో సాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు పోరాడుతున్న అధినేత చంద్రబాబుకు, నిస్తేజంలో కూరుకుపోయిన ప్రజల్లో చైతన్యం రగిల్చేందుకు యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళాని’కి ప్రజల నుంచి అనుహ్యమైన స్పందన లభించడం అభినందనీయమన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడానికి తమవంతు బాధ్యతగా కృషి చేస్తామని, పార్టీకి అన్ని విధాలా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రాథకృష్ణ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కువైత్ టీడీపీ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, వెంకట్ కోడూరి, మూరళీ మారోతూ, రహంతుల్లా షేక్.. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ నుండి ఖాదీర్ భాషా, విశ్వేశ్వరరావు, ముక్కు తులసీ కుమార్, నిరంజన్, ఖతర్ నుండి టీడీపీ నేతలు రమణయ్య, మలిరెడ్డి సత్య, నరేష్ మద్దిపాటి, రవి పొనుగుమాటి, విక్రమ్ సుకవాసి.. బహ్రెయిన్ టీడీపీ నేతలు… వీ. రఘునాథ్ బాబు, హరిబాబు, శివకుమార్, ఏ.వీ రావు, సతీష్ బొల్లా.. సౌదీ అరేబియా టీడీపీ సభ్యులు ఖల్లీద్ సైపుల్లా, భరధ్వాజ్ మాదాల, భాస్కర్ అడబాల, సారథి నాయుడు, శ్రీనివాసరావు కోగంటి, చంద్రశేఖర్.. ఒమన్ టీడీపీ సభ్యులు.. ఇమామ్ మోహద్, హరిబాబు నల్లి, సత్యశ్రీథర్ గారపాటి తదితరులు పాల్గొన్నారు.

మే 12న ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో మినీ మహానాడు

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా వచ్చే మే 12వ తేదిన ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో మినీ మహానాడును ఖైతాన్‌లో నిర్వహిస్తున్నామని ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు, టీడీపీ నాయకులు వంగవీటి రాధకృష్ణ, వి.ఎస్. అమీర్ బాబు, కొనిరెడ్డి రితేష్ రెడ్డి, మాజీ ఎపీ,ఎన్.ఆర్.టీ సభ్యులు వేమూరి రవి, ఎన్నారై టీడీపీ కోర్టినేటర్ బుచ్చిరామ్ ప్రసాద్ పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి గల్ఫ్ టీడీపీ కుటుంబ సభ్యులు తప్పకుండా హజరు కావాలని పిలుపునిచ్చారు.