తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్ నాసర్ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు..
ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్‌కు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు..
సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యూఏఈ రాయబారి తెలిపారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు..
ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ భేటీలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు..