బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి వచ్చి.. తనదైన ప్రతిభతో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతూ.. ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న ఆయన.. గత సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ అనే చిత్రంతో వచ్చేశారు.
దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్పందన సొంతమైంది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు భారీగా దక్కాయి. ఫలితంగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించి రికార్డు సాధించింది.
వాల్తేరు వీరయ్య’ హిట్‌తో జోష్ మీదున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటికే వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ మూవీలో నటిస్తోన్నారు. దీన్ని టాలీవుడ్‌లో డిజాస్టర్ డైరెక్టర్‌గా మిగిలిపోయిన మెహర్ రమేశ్ రూపొందిస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న ఆయన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇక, ఇటీవలే ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి ఓ అదిరే న్యూస్ లీకైంది.
‘భోళా శంకర్’ మూవీలో మహానటి కీర్తి సురేష్ కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మెగాస్టార్ చిరంజీవి సోదరిగా చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ అదిరిపోయేలా వచ్చాయట.
చాలా కాలం తర్వాత చిరంజీవి ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ రోల్‌లో కనిపించబోతున్నారని తెలిసింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకునేలా వీళ్లిద్దరూ సెంటిమెంట్‌ను పండించారని అంటున్నారు. అయితే, ఈ సీన్స్‌కు మెగాస్టార్ ఫ్యాన్స్ తట్టుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ‘భోళా శంకర్’ మూవీలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ కీల పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో శ్రీయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.