Business

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాల్లో ముగిసింది. ఆరంభ లాభాలను కొనసాగించిన సూచీలు రోజంతా అదే జోష్ను కంటిన్యూ చేశాయి. త్రైమాసిక ఫలితాలకు తోడు ఏప్రిల్లో జీఎస్టీ రికార్డ్ వసూళ్లు, వాహన విక్రయాల్లో జోరు, విమాన ప్రయాణాలు పుంజుకోవడం, తయారీ కార్యకలాపాలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరడం వంటి పరిణామాలు మార్కెట్లకు ఊత మిచ్చాయి