మాజీ ఎంపీ మాజీ మంత్రి ఆర్యవైశ్య సమాజం ప్రముఖుడు టీజీ వెంకటేష్ కు తానా మహాసభల ఆహ్వానం పొట్లూరు రవి చేతుల మీదుగా అందించారు. కర్నూలుకు చెందిన టీజీ వెంకటేష్ అదే ప్రాంతానికి చెందిన తానా కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ పొట్లూరు రవికి సన్నిహితుడు. తానా ఆధ్వర్యంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో పొట్లూరు రవి చేపడుతున్న పలు కార్యక్రమాలకు టీజీ వెంకటేష్ చాలా కాలం నుండి తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ కు తానా మహాసభలకు హాజరు కావలసిందిగా పొట్లూరు రవి ఆహ్వానం అందించారు.