WorldWonders

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమందికి కృత్రిమ కాళ్లు అందజేత..

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వందమందికి కృత్రిమ కాళ్లు అందజేత..

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 మందికి చెన్నై నగరంలో కృత్రిమ జైపూర్ కాళ్ళు అందజేయడం …… ముఖ్యఅతిథిగా హాజరైన సంగీత దర్శకుడు శివమణి…

చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై నగరంలో ఆదివారం AMKM జైన్ మెమోరియల్ ట్రస్ట్ ప్రాంగణంలో ఫౌండేషన్ ద్వారా ప్రమాదవశాత్తు మరియు ఇతర కారణాలవల్ల కాళ్లు కోల్పోయిన సుమారు వందమంది దివ్యాంగులకు చేతన ఫౌండేషన్ ద్వారా కృత్రిమ జైపూర్ పాదాలను అందించడం జరిగింది. ఖమ్మం కేంద్రంగా నిర్వహిస్తున్న చేతన ఫౌండేషన్ వారి బృందం ద్వారా ఈ కృత్రిమ పాదాలను అందజేయడం జరిగింది. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ పాదాలను అందించినందుకు ఆనంద్ మరుధర్ కేసరి మధుకర్ జైన్ మెమోరియల్ ట్రస్టు సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యక్షులు వెనగళ్ళ వెంకటేశ్వరరావు, పసుమర్తి రంగారావు, ముత్తినేని సురేష్, మాదినేని నరసింహారావు, సత్తులాల్, నవీన్, రషీద్ తదితరు పాల్గొన్నారు