WorldWonders

ప్రపంచంలోనే తొలి యూనివర్శిటీ మన ” తక్షశిల యూనివర్శిటీ

ప్రపంచంలోనే తొలి యూనివర్శిటీ మన ” తక్షశిల యూనివర్శిటీ

2500 ఏళ్ళనాడు గ్రీకు….చైనా…..జపాన్ దేశాలకు చదువుచెప్పిన ప్రపంచంలోనే తొలి యూనివర్శిటీ మన ” తక్షశిల యూనివర్శిటీ*
క్రీ.పూ 500 సం.లో మగధ సామ్రాజ్యంలోని తక్షశిలలో స్దాపించిన ఈ భారతీయ యూనివర్శిటీ ప్రపంచంలోనే తొలి యూనివర్శిటీ.
ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్ద అయిన UNESCO ఈ యూనివర్శిటీని ప్రపంచ వారసత్వసంపద జాబితాలో చేర్చింది.
తక్షశిల యూనివర్శిటీలో చదువుకోవడానికి బాబిలోనియా..సిరియా..గ్రీసు..చైనా దేశాలనుండి విద్యార్దులు వచ్చి విద్యనభ్యసించేవారు.
ఇక్కడ మొత్తం 68 సబ్జెక్టులలో భోధన జరిగేది.10,000 మందికి పైగా విద్యార్ధులు విద్యనభ్యసించేవారు
” నంద ” వంశాన్ని నిర్మూలించి.. మగధ సామ్రాజ్యస్ధాపనకు , చంద్రగుప్తమౌర్యునికి సహకరించిన ” కౌటిల్యుడు” .
” అష్టాద్యాయి గ్రంధాన్ని ” రాసిన ” పాణిని ” లాంటి మేధావులు తక్షశిల యూనివర్శిటీలో ఫ్రొఫెసర్లు గా పనిచేశారు.
” మౌర్యసామ్రాజ్య ” అగ్రగణ్య చక్రవర్తి ఐన ” అశోకచక్రవర్తి ” ఈ యూనివర్శిటీ లోనే చదువుకున్నాడు.
తక్షశిల యూనివర్శిటీలో….
వైద్యశాస్త్రం రసాయనశాస్త్రం ఖగోళశాస్త్రం కళలు వ్యాకరణం
ప్రముఖ భాషలు రాజనీతి ఆర్ధిక వ్యాపారశాస్త్రాలు గణితం
యుద్దతంత్రం ..మొదలైన శాస్త్రాలను భోధించేవారు .
క్రీ.పూ 5 వ శతాబ్దం నుండి క్రీ.శ 6 వ శతాబ్దం వరకు ” షుమారు ” 1100 యేళ్ళ పాటు ఈ తక్షశిల విశ్వవిధ్యాలయం నిర్విరామంగా నడిచి ప్రపంచదేశాలలో మనదేశానికి పేరుప్రఖ్యాతులు సంపాదించిపెట్టినది.
తర్వాత కాలంలో విదేశీపాలకుల దండయాత్రలవల్ల తక్షశిల యూనివర్శిటీ ధ్వంసమైనది.!
1947 లో …..
అఖండ భారతదేశం రెండు ముక్కలై భారత్ నుండి పాకిస్తాన్ విడిపోవడంతో ఈ తక్షశిల యూనివర్శిటీ పాకిస్దాన్ భూభాగంలోకి వెళ్ళినది.
ప్రస్తుతం ఈ యూనివర్శిటీ పాకిస్దాన్ లోని ” ఇస్లామాబాద్ ” నగరానికి 35 కి.మీ దూరంలో శిధిలమై ఉన్నది!
తక్షశిల యూనివర్శిటీతోపాటు..
క్రీ.పూ 4 వ శతాబ్దంలో ……
బీహార్ లో స్దాపించిన ” నలందా యూనివర్శిటీ ” కూడా నాడు అంతర్జాతీయ యూనివర్శిటీ.
నలందా విశ్వవిద్యాలయంలో చైనా..జపాన్ దేశాలకు చెందిన వేలాదిమంది విద్యార్దులు మనదేశానికి వచ్చి విద్యనభ్యసించేవారని.
చైనా యాత్రికుడైన ” హ్యుయాన్ త్సాంగ్ ” తన రచనలలో రాశాడు
వేల యేళ్ళనాడు విదేశీయులకు మనము చదువునేర్పితే…..
ఇప్పుడు విదేశాలకెళ్ళి వాళ్ళదగ్గర మనం నేర్చుకుంటున్నాము.!