Movies

ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్టు గ్లింప్స్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్టు గ్లింప్స్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. అప్పటి నుంచి ఈ కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

అలాంటివారి నిరీక్షణ త్వరలో ఫలించబోతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రూపొందుతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, టైటిల్ పరంగా మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన హరీశ్ శంకర్, పవన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు (గురువారం) సాయంత్రం 4:59 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.