కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆనందం వ్యక్తం చేశారు. మత రాజకీయాలకు కర్ణాటకలో చోటు లేదని తాజా ఫలితాలను భట్టి స్పష్టమైందన్నారు. నడ్డా, అమిత్, మోదీ వంటి నేతలు ప్రచారం చేసినా కాంగ్రెస్కే ఓటర్లు పట్టం కట్టారన్నారు. బీజేపీకి కాలం చెల్లిందని పేర్కొన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు గద్దె దింపారని వివరించారు.