అక్కినేని ఫ్యామిలీ హీరోలు బాక్సాఫీస్ హిట్ రేసులో వెనకపడ్డారు. నాగార్జున నుంచి అఖిల్ వరకు హిట్ ఫార్ములా మిస్ అయ్యారని అనిపిస్తుంది. అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ కాగా నాగ చైతన్య కస్టడీ అయినా హిట్ కొడుతుంది అనుకుంటే అది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీకి అర్జెంట్ గా ఒక హిట్టు సినిమా కథ కావాలని చెప్పుకుంటున్నారు. నాగార్జున నాగ చైతన్య అఖిల్ ముగ్గురు కలిసి ఆ సినిమాలో నటించాలని అంటున్నారు.
అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి చేసిన సినిమా మనం. అలాంటి సినిమా మరోటి వస్తే ఈ టైం లో బాగుంటుందని చెప్పుకుంటున్నారు. విక్రం కుమార్ డైరెక్షన్ లో వచ్చిన మనం సినిమా ఏయన్నార్ చివరి సినిమాగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆ కథ కేవలం అక్కినేని ఫ్యామిలీ కోసమే అనేలా తీర్చిదిద్దారు. అయితే ఈమధ్య అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
అందుకే మనం లాంటి సినిమాతో అక్కినేని హీరోలంతా కలిసి నటిస్తే ఈ ఫ్లాపుల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ మొదట్లోనే బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్నారు నాగార్జున నాగ చైతన్య.
ప్రేక్షకులు తమ నుంచి ఆశిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలే చేయాలి కానీ ప్రయోగాలు చేస్తే మాత్రం రిజల్ట్ ఇలానే ఉంటుంది. అందుకే మరోసారి అక్కినేని మనం చర్చల్లోకి వచ్చింది. మనం లాంటి సినిమా అంటే అలాంటి కథ అని కాదు కానీ ముగ్గురు అక్కినేని హీరోలు కలిసి చేసే ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చినా హిట్ ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.
ఏజెంట్ తర్వాత అఖిల్ కస్టడీ తర్వాత నాగ చైతన్య తమ నెక్స్ట్ సినిమాలను త్వరలో ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. నాగార్జున మాత్రం ప్రసన్న కుమార్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.