తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL), TAL నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లను 14 May 2023 ఆదివారం రోజు హర్షల్ స్పోర్ట్స్ సెంటర్, స్లవ్, వెస్ట్ లండన్ లో విజయవంతంగా నిర్వహించింది.
టోర్నీని తిలకించేందుకు లండన్, చుట్టుపక్కల ప్రాంతాలనుంచి తెలుగు ప్రజలు, క్రీడాకారులు వచ్చారు. పురుషుల ఓపెన్, పురుషుల 40+, మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్, 16 ఏళ్లలోపు అమ్మాయిలు, 16 ఏళ్లలోపు అబ్బాయిలు విభాగాల్లో మొత్తం 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
శ్రీమతి భారతి కందుకూరి (TAL చైర్పర్సన్) మరియు అనిత నోముల (ట్రస్టీ TAL స్పోర్ట్స్), ట్రస్టీలు రాజేష్ తోలేటి, నవీన్ గాదంసేతి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కిషోర్ కస్తూరి లతోపాటు సమన్వయకర్తలు బాలాజీ కల్లూరు, రాజేష్ వీరమాచనేని, అనిల్ రెడ్డి, షర్మిలా రెడ్డి, రవి దేవనబోయిన, వెంకట్ తోటకూర, ఈవెంట్‌ను విజయవంతం చేసిన వాలంటీర్లు మరియు పాల్గొన్న వాళ్లందరికీ, అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపారు.
వర్గం: విజేతలు & రన్నర్స్-అప్:
పురుషుల ఓపెన్ : రఘువరన్ పసుపులేటి, తేజ అడిగోపుల & మనోజ్ రేమల, ధీరేంద్ర.
పురుషుల 40+ డబుల్స్ : వెంకట్ U, సాయి S & కృష్ణ కిషోర్ తుపాకుల, సుధీర్ తల్లూరి.
మిక్స్డ్ డబుల్స్ : తేజ అడిగోపుల, జ్యోత్స్న చుకార్యా & రాజు చింతలపాటి, మౌనిక నరాలశెట్టి.
మహిళల డబుల్స్ : జయ సురేంద్రబాబు, స్మిత రెడ్డి & దివ్య మూల, మీనా దేవనబోయిన.
U16 అబ్బాయిలు : నిఖిల్ అనేగు, ద్రిషిత్ చౌదరి పాటూరి & నితీష్ తుపాకుల, వసంత్ చాపరాల.
U16 అమ్మాయిలు : ఆశ్రిత కొల్లూరు, జిగీష మామిడాల & శ్రీప్రజ్ఞ మూల, సహస్ర మీనవల్లి.
ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ చంద్ర మువ్వల హాజరై TAL ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ క్రీడా కార్యక్రమాలను అభినందించారు. కౌన్సిలర్ తో పాటు ట్రస్టీలు మరియు కోర్ టీమ్ ద్వారా విజేతలు మరియు రన్నరప్‌లకు ట్రోఫీలు, వాలంటీర్లకు పథకాలు అందజేశారు.