జూన్ 2,3 తేదిలలో శర్వా- రక్షితల వివాహం గ్రాండ్‌గా చేయబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి వివాహ వేడుకకి రాజస్తాన్‌లోని లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్‌తో పాటు సాయంత్రం సంగీత్ నిర్వహించనున్నారు.
ఇక జూన్ 3న రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారట. టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు.