NRI-NRT

TNILIVE ఓనర్: శ్రీ ముద్దుకృష్ణ కిలారు గారి ఆకస్మిక మృతికి “తాకా” సంతాపం!

TNILIVE ఓనర్: శ్రీ ముద్దుకృష్ణ కిలారు గారి ఆకస్మిక మృతికి “తాకా” సంతాపం!

సీనియర్ పాత్రికేయులు, టి ఎన్ ఐ లైవ్ అధినేత శ్రీ కిలారు ముద్దు కృష్ణ (60) గారి హఠాన్మరణం తాకా కార్యవర్గాన్ని దిగ్బ్రాంతి కలుగ చేసింది. దాదాపు 7 సంవత్సరముల నుండి తాకా కార్యక్రమాలను తూచా తప్పకుండ తమ పత్రికలో ప్రచురించే వారు.వచ్ఛే నెలలో జరిగే శ్రీనివాస కళ్యాణమునకు కూడా వస్తారని చెప్పారు. ముద్దు కృష్ణ గారు తిరువూరు ఎన్టీఆర్ జిల్లాలో వుండే వారు. కృష్ణ గారు వివిధ పత్రికలలో పాత్రికేయులు గా పని చేసారు.

ప్రపంచములోని తెలుగు సంస్థలతో, వారి నాయకులతో నిత్యం మాట్లాడుతూ వుండే వారు. TNILIVE సంస్థను స్థాపించి అన్ని ప్రవాస తెలుగు సంస్థలు చేసే కార్యక్రమాలను ప్రచురించే వారు. తాకా కార్యవర్గం ముద్దు కృష్ణ గారి మృతికి సంతాపం తెలియ చేస్తూ,వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ….

తాకా కార్య వర్గం