రూ.3 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న మెడ్‌ట్రానిక్..
తెలంగాణకు విదేశీ కంపెనీలు క్యూకడుతున్నాయి. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో తమ అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న ప్రకటించింది…
తాజాగా మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది…
సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను (R & D Center) ఏర్పాటు చేయనున్నది..
ఈమేరకు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి KTR గారితో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు.చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు…