ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తెలుగు సంస్కృతి, సాంప్రదాయలను కాపాడటమే గాక ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుండి అమెరికాకు ఉన్నత విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు, అమెరికాలో పుట్టి పెరిగి స్థానిక ఉన్నత పాఠశాలల్లో విద్యను పూర్తి చేసి కాలేజీకి వెళ్లే విద్యార్థులకు – రెండు విభాగాల్లో ఉపకారవేతనాలను అందించి విద్యాభివృద్ధికి తోడ్పడుతోంది. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే విద్యార్థుల దరఖాస్తుల నుండి అర్హులైన ఏడుగురిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికీ సెమిస్టర్‌కు $500 చొప్పున నాలుగు సెమిస్టర్లకు $2000లను అందిస్తారు. ఈ ఉపకారవేతనం ప్రతి సెమిస్టర్‌ను ఆశాజనకమైన మార్కులతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే అందిస్తారు. కానీ దరఖాస్తును అమెరికా రాకముందే తగిన ధృవీకరణ పత్రాలతో తానా ఫౌండేషన్‌కు సమర్పించవల్సి ఉంటుంది. ఇక అమెరికాలోనే పుట్టి పెరిగి కాలేజీ విద్యకు వెళ్లబోయే నలుగురు అర్హులైన విద్యార్థులకు $1000 చొప్పున తానా ఉపకారవేతనాలు అందజేస్తారు. మరింత సమాచారం కోసం తానా ఫౌండేషన్ ఛైర్మన్ డా.నల్లూరి ప్రసాద్‌ను, ఉపకారవేతనాల సమన్వయకర్త డా.కాకరాల ప్రసాద్ చౌదరిని, https://www.tana.org/leadership/tana-foundation వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
2019-20 తానా ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
Related tags :