Fashion

లేటెస్ట్ నెక్లేస్‌ మోడల్స్…

లేటెస్ట్ నెక్లేస్‌ మోడల్స్…

ఏదైనా అకేషన్‌కి చాలా మంది రెడీ అవుతారు. మంచి డ్రెస్ వేసుకుంటారు. అయితే, ఏ అవుట్‌ఫిట్‌కైనా సరే.. దానికి తగ్గ నెక్లెస్ లేకపోతే ఆ లుక్ ఇన్ కంప్లీట్‌గానే మిగిలిపోతుంది. అందుకే కచ్చితంగా జ్యువెలరీ ఉండాల్సిందే. దీనికోసమే చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ నెక్లెస్‌ల్లో సరికొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తూ మగువల మనసులు దోచేస్తున్నారు.

నెక్లెస్ సెట్ లేకుండా ఆడవారి అలంకరణ ఉండదనే చెప్పాలి. చిన్న పార్టీస్ నుంచి పెద్ద ఫంక్షన్ల వరకూ ఏదో ఓ చిన్న నెక్లెస్ మగువల విషింగ్ లిస్ట్‌లో ఉండాల్సిందే. ఇందులో భాగంగానే చాలా డిజైన్స్ సృష్టించారు. అందులో ఒకటే చోకర్.

చోకర్ అనేది ఇప్పుడు బోల్డ్ స్టేట్ పీస్‌లా మారింది. అందమైన మెడకు అద్దినట్టుగా ఉండే ఈ చోకర్‌ని వేసుకుని టీనేజర్స్ నుంచిపెద్దవారి వరకూ మురిసిపోతున్నారు. ఇందులో రకరకరకాల చోకర్స్ నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

సెలబ్రిటీలు..

ఎక్కువగా సెలబ్రిటీలు వీటిపై తెగ మనసు పారేసుకుంటున్నారు. వారి సినిమా ఫంక్షన్స్, ఇతర పార్టీలకు హాజరైనప్పుడు ఈ చూడచక్కని చోకర్స్‌తో ఫొటోలకు పోజులిస్తున్నారు. వారిని చూసి ఇక ప్రతి ఒక్కరూ ఆ హీరోయిన్ వేసుకుంది, ఈ హీరోయిన్ వేసుకున్న నెక్లెస్ అని మరీ అడిగి కొనుక్కుంటున్నారు. మరి మీకు ఎలాంటి చోకర్ కావాలి.. అసలు ఇప్పుడు పాపులర్ చోకర్స్ ఏంటో తెలుసుకోండి.

పెర్ల్ నెక్లెస్..

ముత్యాలతో రూపొందించే ఈ పెర్ల్ నెక్లెస్ చూడ్డానికి చాలా బావుంటుంది. ఇది చిన్న చిన్న పార్టీల దగ్గర్నుంచి వెడ్డింగ్ పార్టీస్‌కి కూడా వేసుకోవచ్చు. ఏ అవుట్‌ఫిట్‌కైనా ఇది చక్కగా మ్యాచ్ అయిపోతుంది.

స్టేట్‌మెంట్ నెక్లెస్..

స్టేట్‌మెంట్ నెక్లెస్ అంటే మాంచి బోల్డ్ లుక్‌తో ఉంటుంది. చూడగానే ఎదుటివారి కళ్ళు దీనిపైకి వెళ్ళేలా అట్రాక్టివ్‌, పెద్దగా ఉంటుంది. దీనిలో కలర్ ఫుల్ స్టోన్స్, డిజైన్స్ ఎన్నో రకాలు ఉన్నాయి.

డైమండ్ నెక్లెస్..

చూడ్డానికి చాలా వైబ్రెంట్‌గా, ఎంతో గ్రాండ్ లుక్‌నిచ్చే ఈ చోకర్‌ని ఏ మగువ మాత్రం ఇ్టపడదు చెప్పండి. నేడు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తమ పెళ్ళిల్లో ఈ డైమండ్స్‌ డిజైన్ చోకర్స్‌ని తమ పెళ్ళిల్లో ధరిస్తున్నారు. వీటిని ఒక్కటి వేసుకుంటే చాలు వెడ్డింగ్ లుక్ రావాల్సిందే. ఈ కారణంగా డిజైనర్స్ కూడా వీటిని డిజైన్ చేస్తున్నారు.

చోకర్‌ ఎలా అయినా డిజైన్ చేయొచ్చు.

అయితే ప్లెయిన్‌గా ఉండే డ్రెస్సెస్‌పైకి అయితే మరీ బావుంటాయి. చోకర్స్ వేసినప్పుడు కమ్మలు మరీ పెద్దగా ఉండకుండా చూసుకోండి. అప్పుడు చోకర్ ఎలివేట్ అవుతుంది. అదే విధంగా చోకర్స్ వేసినప్పుడు మరిన్ని నగలు వేయకపోతేనే బావుంటుంది. వీటిని చీరలు, లెహంగాలు వేటికైనా బావుంటాయి.

వెస్ట్రన్ వేర్‌పై కూడా…

అయితే, కేవలం ఇవి ఫెస్టివ్ వేర్ మాత్రమే కాదు, వెస్ట్రన్ వేర్‌పై కూడా సెట్ అవుతాయి. అందుకోసం ప్లెయిన్‌గా ఉండే చోకర్స్‌ని డిజైన్ చేశారు డిజైనర్స్. వీటిని మీరు టీషర్ట్స్, స్కర్ట్స్ వేటిపై అయినా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇవి చూడ్డానికి చాలా ట్రెండీగా ఉండడమే కాదు. మీరు ఫ్యాషన్ ఐకాన్‌గా మారిన ఫీలింగ్‌ని ఇస్తాయి.