* తిరుమలలో బాగా తగ్గిన భక్తుల రద్దీ…
కొన్నిరోజుల కిందట తిరుమలలో విపరీతమైన రద్దీ, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు,4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు,శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.
నిన్న ఒక్కరోజే వెంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు లభించింది. 39,812 మంది భక్తులు తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు.
* అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు కర్నూల్ ఎస్పీ కి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చిన సీబీఐ
విశ్వభారతి ఆస్పత్రి వద్ద పోలీసుల మోహరింపు.
మరికాసేపట్లో విశ్వభారతి ఆస్పత్రికి సీబీఐ అధికారులు.
ఎస్పీ కార్యాలయం దగ్గర పోలీస్ ఫోర్స్ కోసం వేచి చూస్తున్న సీబీఐ.
ఆస్పత్రి చుట్టూ ఎంపీ అవినాష్‌రెడ్డి అనుచరులు.
* అవినాష్ రెడ్డి అరెస్టు కు ఎస్పీ సహకరించటం లేదు ఎస్పీ తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారు…
పులివెందుల కిరాయి మూకల అధీనంలో కర్నూలు హాస్పటల్ ఉందంటే ఏపీ పోలీసులు ఏమి చేస్తున్నారు
వివేకా హంతకుడి నీ పోలీసులు కపడటమా ఏపీ పోలీసుల కి ఇంత కన్నా అవమానం లేదు
డీజీపీ, డీఐజి కలుగాచేసు కోవాలి
అవినాష్ రెడ్డి నీ సిబిఐ కి అప్పచెప్పలి
తల్లి అనారోగ్యం నిజమే అయితే అవినాష్ తల్లి నీ హైదరాబాద్ అపోలో లాంటి హాస్పటల్ కీ తీసుకు వెళతారు కర్నూల్ లో చేర్చరు..
బోండా ఉమా
పోలిట్ బ్యూరో మెంబర్
* అమరావతి మచిలీపట్నం
మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.5,156 కోట్ల వ్యయంతో చేపట్టనున్న “మచిలీపట్నం పోర్టు
ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉపాధి.
* అవినాష్ రెడ్డి నీ సీబీఐ అరెస్ట్ చేస్తే … లా అండ్ ఆర్డర్ సమస్య … వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
▪️సీబీఐకి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.
▪️ సీబీఐ అవినాష్ రెడ్డి నీ అరెస్ట్ చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోంది.
▪️సీఎం చేతిలో ఉంది మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
▪️హాస్పిటల్ ముందు భారీగా ఎమ్మెల్యే అనుచరులు.
▪️ హాస్పిటల్ ముందే కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మరియు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్.
▪️ హాస్పిటల్ దగ్గర సుమారు రెండు వందల మంది కార్యకర్తలతో వైసీపీ ఎమ్మెల్యే లు.
* కర్నూలుకు వైయస్ విజయమ్మ..
కర్నూల్ విశ్వ భారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించడానికి వెళ్లిన వైఎస్ విజయమ్మ..
అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్న వైయస్ విజయమ్మ..
* ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం….
ఆస్ట్రేలియాలోని సిడ్నీ చేరుకున్న ప్రధాని మోదీ; ప్రవాస భారతీయుల నుండి ఘన స్వాగతం లభించింది
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మూడు దేశాల పర్యటనలో మూడవ మరియు చివరి దశ కోసం సోమవారం ఇక్కడకు వచ్చారు, ఈ సందర్భంగా ఆయన తన ఆస్ట్రేలియా కౌంటర్ ఆంథోనీ అల్బనీస్‌తో చర్చలు జరుపుతారు మరియు దేశంలోని డైనమిక్, వైవిధ్యమైన భారతీయ ప్రవాసులను జరుపుకోవడానికి ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆస్ట్రేలియా ప్రభుత్వ అతిథిగా మోదీ మే 22-24 తేదీల మధ్య ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. మోడీ రాకకు ముందు, ప్రధాన మంత్రి అల్బనీస్ ఒక ప్రకటనలో, “ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో అత్యంత ఘన స్వాగతం లభించిన తర్వాత, ఆస్ట్రేలియాలో అధికారిక పర్యటన కోసం ప్రధాని మోడీకి ఆతిథ్యం ఇవ్వడం నాకు గౌరవంగా ఉంది” అని అన్నారు.
* ఫిజీ తర్వాత, పపువా న్యూ గినియా ప్రధాని మోడీకి అరుదైన గౌరవం….
పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు మరియు గ్లోబల్ సౌత్ యొక్క కారణానికి నాయకత్వం వహించినందుకు పాపువా న్యూ గినియా తన అత్యున్నత పౌర ఆర్డర్, గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు (GCL)ని PM మోడీకి ప్రదానం చేసింది. ద్వీప దేశంలో చాలా తక్కువ మంది నాన్-రెసిడెంట్లు ఈ అవార్డును అందుకున్నారు.
* పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించలేదు: ఖర్గే
నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్రం ఆహ్వానం పంపలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు చేశారు. నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కూ ఆహ్వానం పంపలేదని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే దళిత, గిరిజన రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు ఈ పరిణామాలు అర్థం చేస్తున్నాయని ఆరోపణలు చేశారు.
* పొంగులేటి ఓ బచ్చా అని పువ్వాడ విమర్శలు…
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫై ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అంటూ ఎద్దేవా చేసాడు. ఆదివారం ఖమ్మం జిల్లాలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పొంగులేటి..కేసీఆర్ ప్రభుత్వం ఫై , కేసీఆర్ ఫై పలు విమర్శలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.
* పేర్ని నాని పొలిటికల్ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు…
మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు.
* నేడు అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం రఘురామకృష్ణరాజు…
వివేకా హత్య కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్ విచారణను ఈరోజు వెకేషన్ బెంచ్ స్వీకరించలేదు. మెన్షనింగ్ ఆఫీసర్ ముందు కేసును మెన్షన్ చేయాలంటూ ధర్మాసనం అవినాశ్ లాయర్ కు సూచించింది. మెన్షనింగ్ లిస్ట్ లో ఉంటేనే కేసును విచారిస్తామని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ…
* సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు…
తెలుగు సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. మే 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారాయన. మొదట చెన్నై, బెంగళూరులో చికిత్స తీసుకున్న ఆయన.. మెరుగైన వైద్యం కోసం నెల రోజుల క్రితం.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి శరత్ బాబు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు.
* శరత్ బాబు మృతికి చంద్రబాబు సంతాపం…
సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూయడం తెలిసిందే. గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు. దీనిపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. వివిధ భాషల చిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శరత్ బాబు దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారని వివరించారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తున్నానని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని వెల్లడించారు.
* ఇండస్ట్రీలో మరో విషాదం….
యాక్టర్ అండ్ మోడల్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ సోమవారం మధ్యాహ్నం మరణించాడు. బాత్రూమ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో నిర్జీవంగా కనిపించాడు. అతను ఉంటోన్న అపార్ట్మెంట్లోని 11వ అంతస్తు వాష్‌రూమ్‌లో అపస్మారక స్థితిలో ఉన్నాడని అతని స్నేహితుడు గుర్తించి.. సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అక్కడకు చేరుకునేలోపే మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. కాగా, డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే అతను చనిపోయినట్లు తెలుస్తోంది.
* మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస..
మణిపూర్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని న్యూ చెకాన్ ప్రాంతంలో మెయిటీ, కుకీ కమ్యూనిటీలు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టుగా చెబుతున్నారు. స్థానిక మార్కెట్లో గొడవలు మొదలయ్యాయని సమాచారం. ఈ క్రమంలోనే ఆందోళనకారులు కొన్ని ఇళ్లకు నిప్పుపెట్టినట్టుగా సమాచారం. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.