NRI-NRT

బోస్టన్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు….

బోస్టన్‌లో  ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు….

బోస్టన్(అమెరికా): శ్రీ బోళ్ల గారి ప్రోత్సాహంతో, బోస్టన్ ప్రెసిడెంట్ అంకినీడు చౌదరి రావి, న్యూ హాంప్షైర్ ప్రెసిడెంట్ అనిల్ పొట్లూరి గారి చొరవతో, బోస్టన్ లో శత వసంతాల సార్వభౌమునికి నిత్య నీరాజనం కార్యక్రమం ఘనంగా జరిగింది.

సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు అన్నారు. బోస్టన్ మహానగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కాళిదాసు సూరపనేని అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఎన్టీఆర్ కే దక్కుతుంది. ఆయన ద్వారానే బడుగు, బలహీనవర్గాలకు నిజమైన రాజ్యాధికారం లభించింది. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లను కల్పించారు. మహిళల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… . రాజకీయ, సినీరంగంపైనే కాదు.. యావత్ తెలుగు నేలపై ఎన్టీఆర్ పేరు చెరగని సంతకం. సినీ ప్రపంచంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయన సొంతం. అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించారన్నారు. తెలుగు ప్రజలతో మమేకమై విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుని రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవం తెచ్చారు. తెలుగుజాతి చరిత్ర సుసంపన్నం చేసిన మహనీయుడని కొనియాడారు.

యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు వీడియో కాల్ ద్వారా పాల్గొని తన సందేశాన్ని వినిపించారు.

ఈ కార్యక్రమంలో అనిల్ పొట్లూరి, రావి అంకినీడు చౌదరి, శ్రీనివాస్ గొంది, సూర్య తేలప్రోలు, శశికాంత్ వల్లేపల్లి, శ్రీనివాస్ బొల్లా, సురేష్ దగ్గుబాటి, శ్రీకాంత్ చేబ్రోలు, సురేష్ కమ్మ, శివ దొగిపర్తి, చంద్ర వల్లూరుపల్లి, కోటేశ్వరరావు కందుకూరి, గోపి నెక్కలపూడి, మనోజ్ ఇరువూరి, అరుణ్ వెల్లంకి, కేపీ సోంపల్లి, ప్రశాంత్ కాట్రగడ్డ, కృష్ణ మణికొండ, సందీప్ అల్లూరి, బాలాజి బొమ్మిశెట్టి, సురేష్ దోనెపూడి, మోహన్ నన్నపనేని తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంపై క్విజ్ పోటీలు, ఎన్టీఆర్ వేషధారణ పోటీలు నిర్వహించడం జరిగింది. వీటితో పాటు మా ఆ “నంద” తారకం నృత్య నాటక సంగీత కళాంజలి ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పాత రోజుల ఫ్యాషన్ వాక్, ఎన్టీఆర్ పాటలు, డ్యాన్సులతో చేసిన సందడి చేశారు. ఆయా కార్యక్రమాలు ప్రసాంధ్రులను బాగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ గారి అమృత భోజనం అందరూ ఆరగించారు.

సాంస్కృతిక కార్యక్రమాలను మనోజ్ ఇరువూరి, దీప్తి నెక్కలపూడి, శైలజ చౌదరి ఇడుపుగంటి సమన్వయపరిచారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారితో పనిచేసిన గురవయ్య పమిడిముక్కల గారు పాల్గొని, ఆయన అనుభవాలను పాలుపంచుకున్నారు.

బాబురావు పోలవరపు మరియు శ్రీనివాస్ గొంది గారి పిలుపు మేరకు, ఆ శకపురుషుని ఆశయాన్ని కొనసాగించుటకు, కొంత మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తామని చెప్పారు.