NRI-NRT

USA అధ్యక్షుడు బైడెన్ పై హత్యకు కుట్ర…..

USA అధ్యక్షుడు  బైడెన్ పై హత్యకు కుట్ర…..

అమెరికాలో సంచలన సంఘట చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్రకు పాల్పడ్డాడు. బైడెన్ కు హత్య చేయటానికి కుట్రపన్నాడు. దీన్ని ఛేధించిన అమెరికా పోలీసులు సదరు యవకుడిని అరెస్ట్ చేశారు. జో బైడెన్ ను హత్య చేయటానికి కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్ తో దూసుకెళ్లాడు.

వైట్ హౌస్ ముందు బారికేడ్లను ట్రక్ తో ఢీకొట్టాడు. దీంతో పోలీసులు సాయి వర్షిత్ ను అదుపులోకి తీసుకున్నారు. సాయి వర్షిత్ ట్రక్ మీద నాజీ జెండా ఉన్నట్లుగా గుర్తించాడు. సాయి వర్షిత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పలు కేసులు నమోదు చేశారు. అధ్యక్షుడిపై హత్యకు కుట్ర, రాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసం వంటి పలు కేసులు నమోదు చేశారు. అతనిడి పోలీసులు విచారించగా తాను బైడెన్ ను హత్య చేయటానికి ఇలా చేశానని అంగీకరించాడు. ఆరు నెలలుగా బైడెన్ ను హత్య చేయటానికి ప్లాన్ వేశానని దానికి ఏమేమి చేశాడో అన్ని వివరిచాడు.

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ హత్యకు కుట్ర పన్ని సాయి వర్షిత్ స్థానిక కాలమానం ప్రకారం సోమవారం (మే22,2023) రాత్రి 10 గంటల సమయంలో వైట్‌హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చిన ఓ యువకుడు బారికేడ్లను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బైడెన్ ను హత్య చేయటానికి ఆరు నెలల నుంచి ప్లాన్ వేస్తున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై ర్యాష్‌ డ్రైవింగ్‌, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నినట్లుగా కేసులు నమోదు చేశారు.

కాగా.. 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూల్‌ నుంచి అతను గ్రాడ్యుయేషన్‌ పూర్తి చే సాయివర్షిత్‌ అమెరికాలోని మిస్సోరి స్టేట్‌ చెస్ట్‌ఫీల్డ్‌లో ఉంటున్నాడు. ఇటీవల మిస్సోరి నుంచి వాషింగ్టన్‌ డీసీకి ఫ్లైట్‌లో వచ్చిన సాయివర్షిత్‌ వచ్చీరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్లినట్లుగా విచారణలో తేలింది. మొదటి బారికేడ్‌ వద్దనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. సాయి వర్షిత్ సోషల్‌మీడియా అకౌంట్స్‌ ద్వారా సాయివర్షిత్‌ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.