Movies

బ్రో మూవీ నుండి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్….

బ్రో మూవీ నుండి సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్….

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ క‌లిసిచేస్తున్న‌ మల్టీ స్టారర్ మూవీ BRO. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ క‌ళ్యాన్ టైమ్ గాడ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచ్ అయింది. ప‌వ‌ర్ స్టార్ లుక్స్ అభిమానుల‌ని బాగా ఆకట్టుకున్నాయి.. సినిమాపై కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా భాగం కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.

కాగా, ఇవ్వాల మూవీ నుండి తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాలో మార్కండేయ(మార్క్) పాత్ర‌లో న‌టిస్తున్నాడు సుప్రీమ్ హీరో. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, నటుడు వైట్ అండ్ వైడ్ దుస్తులలో మనోహరంగా కనిపిస్తున్నాడు తేజ్.

సినిమాలో పవన్, ఆయన మేనల్లుడి సాయిధరమ్ తేజ్ క‌లిసి చేస్తున్న‌ సీన్లు చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక.. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు, రోహిణి మొల్లేటి, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండ‌గా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.