మాటల మాంత్రికుడు త్రివిక్రం ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేస్తున్నాడు. మహేష్ 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రం అల్లు అర్జున్ ఎన్.టి.ఆర్ లతో సినిమా ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.
అయితే త్రివిక్రం ఈసారి ఒక్క హీరోతో కాదు ఇద్దరు హీరోలతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్రివిక్రం ఆల్రెడీ మెగా మల్టీస్టారర్ కోసం కొన్నాళ్లుగ కృషి చేస్తున్నాడు. చిరంజీవి పవన్ కళ్యాణ్ లతో కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్లానింగ్ లో ఉన్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ముందుకు కదల్లేదు.
అయితే మెగా మల్టీస్టారర్ ఇప్పట్లో కాదని డిసైడ్ అయిన త్రివిక్రం వేరే హీరోలతో మల్టీస్టారర్ చేయాలని అనుకుంటున్నాడట. ఆల్రెడీ ఆర్.ఆర్.ఆర్ తో సాధ్యం కాదు అనుకున్న ఎన్.టి.ఆర్ చరణ్ ల కాంబోని సెట్ చేశాడు రాజమౌళి.
త్రివిక్రం మల్టీస్టారర్ అంటే స్టార్ హీరోలు కూడా మేము రెడీ అనేస్తారు. ముఖ్యంగా త్రివిక్రం మల్టీస్టారర్ కథ రాసుకుంటే మాత్రం ముందు ఆ ఇద్దరి స్టార్స్ ని ఫిక్స్ చేసుకునే కథ సిద్ధం చేస్తాడు.
సో మొత్తానికి త్రివిక్రం కూడా ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఇంతకీ త్రివిక్రం మల్టీస్టారర్ లో ఎవరెవరు నటించే ఛాన్స్ ఉంది అంటే విచిత్రంగా ఒకరు తెలుగు హీరో మరొకరు తమిళ హీరో అని టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్లుగా త్రివిక్రం తో సినిమా ప్లానింగ్ లో ఉన్న ఒక కోలీవుడ్ హీరో.. తెలుగులో స్టార్ హీరో ఈ ఇద్దరిని పెట్టి త్రివిక్రం మల్టీస్టారర్ చేస్తారట.
ఇది జరిగితే మాత్రం నిజంగానే త్రివిక్రం కూడా 500 కోట్లు 1000 కోట్ల సినిమా రేంజ్ కి వెళ్లినట్టే. తన కథలతో.. తన మాటలతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రం ఈసారి మల్టీస్టారర్ తో పెద్ద స్కెచ్ వేశాడని అనిపిస్తుంది.
అయితే త్రివిక్రం తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ఎన్.టి.ఆర్ అల్లు అర్జున్ లతో ఒక మల్టీస్టారర్ కథ రాయొచ్చు కదా గురూజీ అంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. అదే జరిగితే మాత్రం ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.