చిన్న సినిమాగా తెరకెక్కి ప్రస్తుతం ఎక్కువ మందిని ఆకర్షిస్తోన్న సినిమా మేమ్ ఫేమస్. యుట్యూబ్ వీడియో కంటెంట్ లతో సక్సెస్ అయిన చాయ్ బిస్కెట్ ప్రొడక్షన్ నుంచి ఈ మూవీ వస్తోంది. సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంగా హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మే 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఇప్పటికే సినిమాకి హీరో సుమంత్ ప్రభాస్ కావాల్సినంత హైప్ తీసుకొని వచ్చాడు.
షార్ట్ వీడియోతో పాటు సెలబ్రిటీలతో బైట్స్, ఫన్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మేము ఫేమస్ సినిమాని భాగా ప్రమోట్ చేశారు. దీంతో యూత్ కి ఈ మూవీ భాగా చేరువ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ లో ప్రత్యేకంగా పోస్ట్ చేయడం విశేషం. మేము ఫేమస్ సినిమా చూసాను.
చాలా అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి నటీనటులు అద్భుతంగా పెర్ఫర్మ్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు, హీరో సుమంత్ అశ్విన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అతని దగ్గర చాలా ప్రతిభ ఉంది. విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అన్ని క్రాఫ్ట్స్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. కొత్తవారు అందరూ కలిసి ఈ సినిమాని నిర్మించారంటే నమ్మలేకపోతున్నాను. ఇంత మంచి చిత్రం చేసినందుకు మీకు ప్రత్యేక అభినందలు.
అలాగే మంచి టాలెంట్ ని పరిచయం చేసినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మేము ఫేమస్ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు మరింత బూస్టింగ్ ఇవ్వడంతో పాటు సినిమాకి కలెక్షన్స్ పెరగడంలో కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.
మొత్తానికి స్టార్ సెలబ్రిటీల ప్రమోషన్స్ తో మేము ఫేమస్ చిత్రానికి ఇప్పుడు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో అందరికి రిలేట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో కచ్చితంగా చేరువ అవుతుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం హీరో కమ్ దర్శకుడు సుమంత్ ప్రభాస్ కి, చాయ్ బిస్కెట్ నిర్మాతలకి ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.