Health

బోన్స్ ను బలహీనానికి గురిచేసే గల కారణాలు….

బోన్స్ ను బలహీనానికి గురిచేసే గల కారణాలు….

మన శరీరానికి ఆకారాన్ని ఇచ్చే అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఎముకలు ఒకటి. ఇవి బలహీనంగా ఉంటే మనం ఏ పని సరిగ్గా చేయలేం. కాబట్టి ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని విషయాల గురించి ఇప్పుడు చుద్దాం..

* కదలకుండా ఎక్కువ సేపు ఓకే దగ్గర కూర్చోవడం, పడుకోవడం వంటి నిశ్చల జీవనశైలిని గడిపే వారి ఎముకలు బలహీన పడతాయి.

* వ్యాయామం చేయకపోవడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.

* అందుకోసం రోజుకు కనీసం 25 నుంచి 30 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరంటున్నారు నిపుణులు.

* కాల్షియం అధికంగా ఉండే పాలు, గుడ్లు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గిస్తే ఎముక బలహీన పడుతుంది.

* ప్రతిరోజూ 1000 నుంచి 1200 మి.గ్రా కాల్షియాన్ని ఉన్న ఆహారాలను తినాలి.

* సూర్యరశ్మి తగలకపోవడం, ఫుడ్ సమయానికి తినకపోవడం, కొన్ని అనారోగ్య సమస్యలు విటమిన్ డి లోపానికి కారణమవుతాయి.

* అలాగే స్మోకింగ్, మందు ఎక్కువగా తాగే వారికి ఎముకలు తొందరగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. స్మోక్ చేయడం వల్ల కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది.

* మందు అధికంగా తాగడం వల్ల ఎముకల నిర్మాణానికి ఆటంకం కలుగుతుంది.

* దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. తరచూ మందులు వాడే వారికి ఈ సమస్య తొందరగా దరి చేరుతుంది.

* రుమటాయిడ్ ఆర్థరైటిస్, తాపజనక ప్రేగు వ్యాధి, హార్మోన్ల రుగ్మతలు, క్యాన్సర్ దీర్ఘకాలిక చికిత్సలు లాంటి సమస్యలు ఎముకలను బలహీనపరుస్తాయి.