మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ ఎగుమతిపై బ్రిటన్ నిషేధం విధించింది. ఇది దేశం దాటి వెళ్లకూడదని, భారత్-బ్రిటిష్ సంబంధాలను అధ్యయనం చేయడానికి ఈ అరుదైన, విలువైన (సుమారు రూ.20 లక్షల ఖరీదు) ఆయుధం కీలకమని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్లింట్లాక్ స్పోర్టింగ్ గన్ అని పిలిచే ఈ తుపాకీ 1793-94 కాలానికి చెందినది. ఈ సింగిల్ బ్యారెల్ తుపాకీ నుంచి రీలోడింగ్ చేయకుండానే ఒకేసారి సారి రెండు తూటాలు వెలువడతాయి. తయారు చేసిన అసద్ ఖాన్ మహ్మద్ సంతకం కూడా దీనిపై ఉంది. ఇది అప్పటి జనరల్ కార్న్‌వాలిస్‌కు బహుమతిగా వచ్చిందని బ్రిటన్ వర్గాలు చెబుతున్నాయి. టిప్పు సుల్తాన్‌కు చెందిన ఓ కత్తికి ఇటీవల వేలంలో రూ.144 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే.