దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా శత జయంతి వేడుక :
అడిలైడ్ నగరం లో టీడీపీ సెల్ ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలు గా నందమూరి వసుంధర దేవి , విశిష్ట అతిధి గా బాలకృష్ణ చిన్న కుమార్తె,నందమూరి ఆడపడుచు తేజస్విని గారు హాజరయ్యారు.
వేడుక గా జరిగిన ఈ కార్యక్రమం లో స్థానిక తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొన్ని ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా అతిధులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్బంగా శత జయంతి ని పురస్కరించుకొని టీడీపీ అడిలైడ్ వారు ప్రత్యేకంగా రూపొందించిన మ్యాగజైన్ ని తేజస్విని కమిటీ సభ్యులు తో కలిసి ఆవిష్కరించారు.
అందరికి జ్ఞాపకం గా ఉండేలా Nri టీడీపీ సెల్ అడిలైడ్ వారిచే ప్రత్యేకంగా తయారు చేయబడ్డ 6 గ్రాముల వెండి నాణెం ని వసుంధర దేవి రిలీజ్ చేసారు. విశేషమైన ఆలోచన తో ఈ ప్రయత్నం చేయడం పట్ల ఆర్గనైజర్స్ ను అభినందించారు.
యువత ఉత్సాహం, సంబరం గా జరుగుతున్న కార్యక్రమం లో..అభిమానులు కోరిక మేరకు వసుంధర దేవి వెంటనే బాలకృష్ణ కి ఫోన్ చేయడం తో కొద్దీ సేపు అయినా వీడియో కాల్ ద్వారా అందరని ఉద్దేశించి ప్రసంగించారు.. స్థానికం గా ఉన్న తెలుగువారు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నడం పట్ల ధన్యవాదములు తెలుపుతూ.. ఇదే ఉత్సాహం తో అందరూ కలిసికట్టుగా ఉంటూ మన రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అని NRI లకు గుర్తు చేసారు.
ఈ వేడుక సందర్బంగా నిర్వహించిన పలు సంప్రదాయ సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చివరిగా అతిధులును ప్రత్యేకంగా తయారు చేయించిన వెండి నాణేలు తో కూడుకున్న మోమెంటం తో పాటు శాలువా తో సత్కరించారు
ఈ సందర్బంగా చేసిన ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు , ఎన్టీఆర్ జీవిత ముఖ్య విశేషాలు తో ఏర్పాటు చేసిన గ్యాలరి చూపరలు ను ఆకట్టుకున్నాయి. అన్ని కమిటీల సభ్యులు,వాలంటీర్స్ కష్టం వల్లనే నగరం లో ఎప్పుడు లేని అంత అంగరంగ వైభవం గా శత జయంతి వేడుకను నిర్వహించాం అని టీడీపీ దక్షిణ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నవీన్ నేలవల్లి తెలిపారు.. ఈ సందర్బంగా సహకరించిన సభ్యులు కు కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేసారు