రక్తహీనత ఉన్నవారిలో కనిపించే అత్యంత సాధారణ లక్షణాలు ఏంటంటే అలసట, శక్తి లేకపోవడం, ఏమీ చేయాలని అనిపించకపోవడం, మైకం, తలనొప్పి, చర్మ రంగు పాలిపోవడం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి.రక్తహీనతను తగ్గించడానికి ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఇంకా రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి.వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.దానిమ్మ పండ్లలో కాల్షియం, ఐరన్, స్టార్చ్, ఫైబర్ లు చాలా పుష్కలంగా ఉంటాయి. దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచి రక్తహీనతను నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది.అలాగే బీట్ రూట్ చాలా రోగాలను దూరం చేయడానికి సహాయపడుతుంది.ఈ బీట్ రూట్ చాలా పోషకమైనది.
ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఇంకా మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బీట్ రూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఇంకా ఫైబర్ లు కూడా ఉంటాయి.ఖర్జూరాలనేవి పోషకాల భాండాగారం. వీటిలో ఐరన్ కంటెంట్ చాలా సమృద్ధిగా ఉంటుంది.
ప్రతి రోజూ కొన్ని ఖర్జూరాలను తింటే రక్తహీనత సమస్య నుంచి ఈజీగా బయటపడతారు.జీడిపప్పుల్లో ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడానికి చాలా బాగా సహాయపడతాయి. 100 గ్రాముల జీడిపప్పులో 6.6 మిల్లీగ్రాముల ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది.అలాగే ఆప్రికాట్ లో కూడా ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇవి రక్తహీనతను నివారించడానికి చాలా బాగా సహాయపడతాయి. 100 గ్రాముల ఎండిన ఆప్రికాట్ పండులో 2.7 మిల్లీగ్రాముల ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది.అలాగే నేరేడు పండులో ఫోలిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇతర విటమిన్లు ఇంకా ఖనిజాలు ఉంటాయి.అలాగే చియా విత్తనాలు మన ఒంట్లో రక్తాన్ని ఈజీగా పెంచుతాయి.
ఇవి దక్షిణ అమెరికా దేశాలు ఇంకా మెక్సికోలో కనిపించే సిల్వియా హిస్పానికా అనే మొక్క విత్తనాలు. ఈ బేబీ సీడ్ అనేది ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్ లు, ఖనిజాల భాండాగారం. వీటిలో ఫైబర్, కాల్షియం, జింక్, ఐరన్ ఇంకా ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తింటే రక్తహీనత సమస్య ఈజీగా పోతుంది.